Saif ali khan hospitalised: సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి

ABN , Publish Date - Jan 16 , 2025 | 08:39 AM

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై (Saif Alikhan) గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. తన నివాసంలోనే ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు.


బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై (Saif Alikhan) గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. తన నివాసంలోనే ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలైనట్లు (Ali Khan Stabbed) తెలుస్తోంది. సైఫ్‌ను లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు(Saif ali khan hospitalised) . వైద్యులు సర్జరీ చేస్తున్నారనీ, ఆ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడిస్తారని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అతడిని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు.  ఆ దుండగుడు ఎవరు.. దాడి చేయడానికి కారణమేంటనేది తెలియాల్సి ఉంది. (saif ali khan hospitalised)

Updated Date - Jan 16 , 2025 | 08:49 AM