Saif Ali Khan: ఆ ఆలోచనతోనే తైమూర్‌ను వెంట తీసుకెళ్లా

ABN , Publish Date - Feb 10 , 2025 | 12:40 PM

దాడి తర్వాత మొదటిసారి ఇంటర్వ్యూలో పాల్గొన్న సైఫ్ అలీ ఖాన్ ఆరోజు తన కుమారుడు తైమూర్‌(Taimur’s response) మాటలను గుర్తుచేసుకున్నారు. కత్తితో పొడిచి నట్లు మొదట తెలియలేదని, ఏదో చిన్న గాయం అనుకున్నానని చెప్పారు.

బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali khan) ఓ దుండగుడి దాడిలో గాయపడిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి చేరుకున్న ఆయన ప్రస్తుతం ఇంట్లో విశాంత్రి తీసుకుంటున్నారు. దాడి తర్వాత మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆరోజు తన కుమారుడు తైమూర్‌(Taimur’s response) మాటలను గుర్తుచేసుకున్నారు. కత్తితో పొడిచి నట్లు మొదట తెలియలేదని, ఏదో చిన్న గాయం అనుకున్నానని చెప్పారు. వీపు భాగంలో నొప్పి రావడంతో కత్తితో దాడి దాడి జరిగిందని గుర్తించినట్లు చెప్పారు. (Saif Ali khan attack))

‘‘దాడి జరిగిన కాసేపటికి నాకు వీపులో విపరీతమైన నొప్పి కలిగింది. అప్పుడు గమనిస్తే కత్తితో దాడి చేసినట్లు తెలిసింది. అది చూసి కరీనా చాలా కంగారు పడింది. అందరికీ ఫోన్లు చేసింది. ఎవరూ ఫోన్‌ తీయలేదు. ఒకరినొకరం చూసుకున్నాం. నేను బాగానే ఉన్నాను.. నాకేం కాదని ఆమెకు ధైర్యం చెప్పాను. తైమూరు నా దగ్గరకు వచ్చి ‘నాన్నా.. నువ్వు చనిపోతావా?’ అని అడిగాడు. అలా ఏం జరగదన్నాను’’ అని సైఫ్‌ అన్నారు.  సైఫ్‌ను ఆసుపత్రిలో చేర్చినప్పుడు అతడితో పాటు తైమూర్‌ కూడా ఆసుపత్రికి వచ్చినట్లు లీలావతి వైద్యులు విడుదల చేసిన నివేదికలో ఉంది.




దీని గురించి సైఫ్‌ మాట్లాడుతూ..
‘‘దాడి జరిగిన తర్వాత కొంత సేపటికి నా కుమారుడు చాలా కూల్‌గా ఆలోచించాడు. ‘నేనూ మీతో వస్తాను’ అని ఆసుపత్రికి వచ్చాడు. నేను కూడా ఒంటరిగా వెళ్లాలనుకోలేదు. అందుకే నాతో తైమూర్‌ను తీసుకెళ్లాను. ఒకవేళ నాకు ఏమైనా జరిగినా ఆ సమయంలో నా కుమారుడు నా పక్కనే ఉండాలని కోరుకున్నాను’’ అని సైఫ్‌ వివరించారు. ఈ దాడి కేసులో పురోగతి కనిపిస్తుంది. దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీసులు ఇటీవల ఐడెంటిఫికేషన్‌ పెరేడ్‌ చేపట్టారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు మహ్మద్‌ షరీఫుల్‌ ఇస్లాం షెహజాద్‌ను ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులైన సైఫ్‌ ఇంటి సహాయకులకు చూపించారు. ఆర్థర్‌ జైలులో అధికారుల సమక్షంలో జరిగిన ఈ ఐడెంటిఫికేషన్‌ పెరేడ్‌లో నిందితుడిని వారు గుర్తించారు. సైఫ్‌పై దాడి చేసింది అతడేనని చెప్పారు. 

Updated Date - Feb 10 , 2025 | 12:40 PM