Saif Ali Khan: సైఫ్‌పై దాడి చేసిన వ్యక్తి ఇతడే..

ABN , Publish Date - Jan 16 , 2025 | 06:16 PM

Saif Ali Khan: ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పై ఎటాక్ నిందితుడు చిక్కాడు.

Saif Ali Khan knife attack Suspect caught on camera

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన దుండగుడి ఫొటోను ముంబై నగర పోలీసులు గురువారం విడుదల చేశారు. సైఫ్ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌‌లోని సీసీ కెమెరాలో నమోదు అయిన అతడి పొటోను పోలీసులు విడుదల చేశారు. మరోవైపు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అందులోభాగంగా తాజాగా సైఫ్ నివాసానికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. అందులో నిందితుడిని గుర్తించారు. సంబంధిత వీడియోలో నిందితుడు మెట్లు దిగుతూ కనిపించాడు. అవి అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంకోవైపు సైఫ్ అలీఖాన్‌పై దాడి నేపథ్యంలో ముంబై క్రైం బ్రాంచ్‌కు చెందిన 8 బృందాలను విచారణకు ఏర్పాటు చేశారు. దీంతో ముంబై పోలీసులతో 7 బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు. దీంతో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిపై మొత్తం 15 బృందాలు విచారణ జరుపుతోన్నాయి.


గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీఖాన్‌ నివాసంలో చోరీకి పాల్పడేందుకు దుండగుడు ప్రవేశించాడు. దీంతో ఇంట్లో అలికిడి కావడంతో.. సైఫ్ అలీఖాన్ మెల్కోన్నారు. ఆ దండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య చిన్న వాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఆ క్రమంలో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.ఇంతలో సైఫ్ అలీఖాన్ బిగ్గరగా అరవడంతో.. దుండగుడు అక్కడి నుంచి పరారయ్యారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు అప్రమత్తమై.. అతడిని లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీఖాన్‌కు లీలావతి వైద్యులు పలు శస్త్ర చికిత్సలు నిర్వహించారు.

అయితే ఆయనకు ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. అలాగే సైఫ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ సైతం విడుదల చేశారు. ఇక ఈ ఘటన జరిగిన సమయంలో సైఫ్ భార్య కరీనా కపూర్ ఇంట్లో లేరు. ఈ దాడి ఘటన తెలియడంతో ఆమె హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. దాడి ఘటన ఎలా జరిగిందంటూ ఇంట్లోని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఆందోళన చెందారు. అలాగే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. పక్కింటి సీసీ ఫుటేజ్‌లను సైతం పరిశీలించారు. ఇక క్లూస్ టీమ్ సైఫ్ నివాసానికి చేరుకొని.. నిందితుడికి సంబంధించిన ఆధారాలను సేకరించారు. నిందితుడు కోసం గాలింపు చర్యలను ముంబై పోలీసులు తీవ్ర తరం చేశారు. అలాగే దుండగుడు సైఫ్ అలీఖాన్ నివాసంలోకి అత్యవసర మార్గం ద్వారా వెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు.

Updated Date - Jan 16 , 2025 | 07:46 PM