Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్.. హాస్పిటల్ బిల్ ఎంత అయిందో తెలుసా?
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:01 PM
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ముంబై లీలావతి హాస్పిటల్ నుండి మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు 5 రోజుల చికిత్స అనంతరం ఆయన తన ఇంటికి చేరుకున్నారు. జనవరి 16న రాత్రి సైఫ్ అలీఖాన్‌పై ఓ అగంతకు దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ అగంతకుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఇక సైఫ్ ట్రీట్‌మెంట్‌కు అయిన ఖర్చు ఇప్పుడు వార్తలలో నిలుస్తోంది. విషయంలోకి వస్తే..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల ఓ అగంతకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, ఆ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్‌ను దగ్గరలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. లీలావతి ఆస్పత్రిలో చికిత్స అనంతరం సైఫ్ అలీఖాన్ కోలుకుని మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. జనవరి 16వ తేదీన సైఫ్ అలీఖాన్‌పై దాడి జరగగా.. దాదాపు 5 రోజుల పాటు ఆస్పత్రిలోనే సైఫ్ చికిత్స పొందారు. 5 రోజుల చికిత్స అనంతరం సైఫ్ కుటుంబ సభ్యుల సాయంతో ఇంటికి చేరుకున్నారు. కొన్ని రోజుల పాటు సైఫ్‌కు బెడ్ రెస్ట్ అవసరమని, ఆయనను పరామర్శించేందుకు ఎవరిని ఇంట్లోకి అనుమతించ వద్దని సైఫ్ కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించినట్లు సమాచారం. అలా పరామర్శల వల్ల.. సైఫ్‌కు ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశముందని ఆయన కుటుంబ సభ్యులకు వారి వివరించినట్లు సమాచారం.
Also Read- Saif Ali Khan: సైఫ్‌ని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఆ రివార్డు ఏమిటంటే..
ఈ 5రోజుల చికిత్సలో సైఫ్ అలీఖాన్‌ను మళ్లీ నార్మల్ స్థితికి తీసుకువచ్చేందుకు డాక్టర్స్ తీవ్రంగా కృషి చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా వెన్నెముకలో కత్తి విరగడంతో, ఆ కత్తిని చాలా జాగ్రత్తగా తీసిన డాక్టర్స్.. ఇంకా ఇతర చోట్ల కూడా గాయాలు అయినట్లుగా తెలిపారు. అలాగే ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసినట్లుగా చెప్పుకొచ్చారు. అన్నీ సక్సెస్ అయ్యానని, త్వరగానే సైఫ్ కోలుకుంటారని డాక్టర్స్ చెబుతూ వచ్చారు. వారు చెప్పినట్లుగానే సైఫ్ 5 రోజుల్లోనే కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ 5 రోజుల్లో సైఫ్‌కి జరిగిన చికిత్సకు డాక్టర్స్ ఎంత బిల్ వేశారో తెలిస్తే అంతా షాక్ అవుతారు.
సైఫ్ అలీఖాన్ ట్రీట్‌మెంట్ నిమిత్తం అక్షరాలా రూ. 35,98,700 బిల్ అయినట్లుగా సోషల్ మీడియాలో లీలావతి హాస్పిటల్ ఇచ్చినట్లుగా ఓ బిల్ వైరల్ అవుతోంది. అంటే 5 రోజులకు దాదాపు రూ. 36 లక్షల బిల్ అయిందన్నమాట. రోజుకు దాదాపు రూ. 7 లక్షల రూపాయలు. నిజంగా ఇలాంటి ఘటన ఓ సామాన్యుడికి జరిగి ఉంటే.. అతని పరిస్థితి ఏంటి? అనేలా నెటిజన్లు డిస్కస్ చేస్తున్నారు. అయితే సైఫ్ అలీఖాన్‌కి అయిన బిల్లులో రూ. 25 లక్షల వరకు హెల్త్ ఇన్సూనెన్స్ అప్లయ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇది నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలనే విషయాన్ని తెలియజేస్తున్నట్లుగా ఉంది. మరి ఈ బిల్లు ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతోంది. ఏదయితేనేం, ఎంతయితేనేం.. సైఫ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.. అది చాలు అని అంటున్నారు ఆయన అభిమానులు.