Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్..
ABN , Publish Date - Jan 26 , 2025 | 04:04 PM
Saif Ali Khan: ప్రస్తుతం నిందితుడు షరీఫుల్ ఇస్లాంని పోలీసులు విచారణ చేస్తుండగా.. ఫోరెన్సిక్ బృందం కీలక సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నం అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ జరిగిన దాడి కేసులో రోజుకో ట్విస్ట్ సినిమాని తలపిస్తుంది. ఈ కేసును సీరియస్ గా తీసుకొని విచారణ చేపట్టిన ముంబై పోలీసులకు మరో చిక్కు ఎదురైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నిందితుడు షరీఫుల్ ఇస్లాంని పోలీసులు విచారణ చేస్తుండగా.. ఫోరెన్సిక్ బృందం కీలక సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నం అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఇంతకీ ఏం జరిగిందంటే
ఘటన స్థలంలో కీలక ఆధారాలను సేకరించేందుకు ఫోర్సెనిక్ బృందం సైఫ్ బట్టలతో పాటు, ఘటన స్థలంలో, నిందితుడి దగ్గర లభించిన బ్లడ్ శాంపిల్స్ ని పరిశీలించారు. అలాగే 19 వేలి ముద్రలను సేకరించారు. కానీ.. ఆ వేలిముద్రలతో నిందితుడి వేలిముద్రలు మ్యాచ్ కాకపోవడంతో పోలీసులు నోరు తెరిసినట్లు సమాచారం. దీంతో మరోసారి ఫింగర్ ప్రింట్స్ సేకరించిందేకు పోలీసులు సిద్ధమయ్యారు.
నిందితుడి ప్లాన్ ఇదే..
"జనవరి 16న ముంబైలోని సద్గురు శరన్ అపార్ట్మెంట్స్ లో అర్థరాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులు నిద్రిస్తున్నట్లు తెలుసుకున్న నిందితుడు.. బిల్డింగ్ ప్రహరీ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం వెనుక మెట్లు ఎక్కి ఎయిర్ కండీషనింగ్ డక్ట్ సాయంతో సైఫ్ ఇంట్లోకి వచ్చాడు. చప్పుడు కాకుండా ఉండేందుకు చెప్పులు తీసేసి బ్యాగ్‌లో దాడి సెల్‌ఫోన్ స్విచ్ఫాఫ్ చేసుకున్నాడు" అని సమాచారం. దాడి తర్వాత సైఫ్ తనని బాత్రూమ్‌లో బంధించాడని.. ఎయిర్ కండీషనింగ్ డక్ట్ సాయంతో ఆ గది నుంచి బయటపడ్డానని అతడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దాడి తర్వాత పోలీసులు గాలిస్తున్నారని గ్రహించిన అతడు కోల్‌కత్తాలోని హౌరా నుంచి బంగ్లాదేశ్ పారిపోవాలని భావించాడు. ఈ క్రమంలో పలువురు ట్రావెల్ ఏజెంట్లను కలిసి హావ్‌డా ట్రైన్ టికెట్ కోసం ప్రయత్నించాడు. వారు ఎక్కువ డబ్బు చి?మాండ్ చేయడంతో అతడు వెంటనే చెల్లించలేకపోయాడు. నిందితుడు ఉపయోగించిన సిమ్ కార్డు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఖుకుమోని జహంగీర్ సెఖా అనే వ్యక్తి పేరుపై ఉంది.