Saif Ali Khan: సైఫ్ దాడిలో బిగ్ ట్విస్ట్..
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:30 PM
Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో బిగ్ ట్విస్ట్ ఏర్పడింది. తాజాగా ముంబై పోలీసులు మాట్లాడుతూ..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో బిగ్ ట్విస్ట్ ఏర్పడింది. తాజాగా ముంబై పోలీసులు మాట్లాడుతూ.. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఇప్పటికే పలు మీడియా ఛానల్స్ నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు వార్తలు చేశాయి అయితే.. ట్విస్ట్ ఏంటంటే
అసత్య ప్రచారాలు
సైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ ఉదయం కథనాలు వచ్చాయి. దీనిపై పోలీసులు రియాక్ట్ అయ్యారు. పొద్దున బాంద్రా పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చిన వ్యక్తికి సైఫ్ మీద దాడితో సంబంధం లేదని స్పష్టం చేశారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. నిందితుడు తమ అదుపులో ఉన్నాడని వస్తున్న పుకార్లలో నిజం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పుకొచ్చారు.