Rohit Setty: కాప్ యూనివర్స్ లో రెండు సీక్వెల్స్
ABN , Publish Date - Apr 24 , 2025 | 10:00 AM
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి... తన కాప్ యూనివర్శ్ లోని రెండు సినిమాలకు సీక్వెల్స్ రూపొందించే పనిలో ఉన్నారు.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Setty) కి కాప్ యూనివర్స్ మీద మంచి పట్టుంది. అలాన్ ఫ్రాంచైజ్ మూవీస్ చేయడంలోనూ రోహిత్ శెట్టి దిట్ట. అందుకో గోల్ మాల్ సీరిస్ ఓ ఉదాహరణ. గోల్ మాల్ (Golmaal) ఫ్రాంచైజ్ లో మొత్తం నాలుగు సినిమాలు తీసేశాడు రోహిత్ శెట్టి. అలానే పోలీస్ స్టోరీ 'సింగమ్' (Singham) సీరిస్ లోనూ 'సింగమ్ రిటర్న్స్' (Singham Returns) , 'సింగమ్ అగైన్' (Singham Again) చిత్రాలను రూపొందించాడు. ఇందులో కొన్ని రీమేక్స్ కాగా.. మరికొన్నింటికి తానే కథను తయారు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే... ఈ పోలీస్ యూనివర్శ్ లో రెండు సినిమాలకు కథలను సిద్థం చేస్తున్నట్టు రోహిత్ శెట్టి ఇటీవల తెలిపాడు.
'టెంపర్' (Temper) కథను బేస్ చేసుకుని రోహిత్ శెట్టి తీసిన హిందీ సినిమా 'సింబా' (Simmba). రణవీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నాడట రోహిత్. అలానే నాలుగేళ్ళ క్రితం అక్షయ్ కుమార్ తో 'సూర్యవంశీ' (Sooryavanshi) మూవీని తెరకెక్కించాడు రోహిత్ శెట్టి. ఇప్పుడు ఆ సినిమాకూ సీక్వెల్ తీసే ప్రయత్నం చేస్తున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా సాగుతోందని, అది పూర్తి కాగానే ఎప్పుడు ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్ళేది చెబుతానని రోహిత్ అంటున్నాడు. సో... బాలీవుడ్ ప్రేక్షకులను ఇప్పట్లో ఈ కాప్ యూనివర్స్ స్టోరీలు వదిలేలా లేవు!
Also Read: Janhvi Kapoor: వెండితెర నుండి వెబ్ సీరిస్ కు....
Also Read: NTR- ANR: నందమూరి - అక్కినేని అనుబంధం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి