Rashmika Mandanna: పెరుగుతున్న రష్మిక ఆధిపత్యం.. శ్రీవల్లికి మరో ఛాలెంజ్

ABN , Publish Date - Jan 22 , 2025 | 08:24 AM

Rashmika Mandanna: "కమర్షియల్ రోల్స్‌లో అద్భుతంగా నటించి దూసుకుపోతున్న రష్మికకు ఇది ఛాలెంజింగ్ రోల్ అంటున్నారు. మరి ఈ పాత్రలో రష్మిక నటన ఎలా ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న.. ప్రతిభావంతమైన దర్శక నిర్మాతలు ఆమెని ఎంపిక చేయడం ద్వారా అనుమానాలకు కాస్త అడ్డుకట్ట పడింది. ఈ పాత్రతో రష్మిక విమర్శకుల నోర్లు మూయించనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు".

Rashmika Mandanna in chhava

కొన్నేళ్లుగా కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్న ఆధిపత్యం మొదలైంది. అద్భుతమైన పాత్రల ఎంపికతో ఆమె టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోల పక్కనా ఛాన్స్ కొట్టేయడం కాకుండా మంచి కథలతో తెరకెక్కుతున్న విభిన్న పాత్రల్లోనూ నటిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆమెకి ఒక ఛాలెంజ్ ఎదురైంది. ఆడియెన్స్ అయితే దీనిని ఛాలెంజ్ అనుకుంటున్నారు. కానీ.. ఈ టాస్క్ ని ఆమె కంప్లీట్ చేసేశారు. ఇంతకీ అదేంటంటే..


అదే 'ఛావా’. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ‘మిమి’, ‘చుప్పి’ ఫేమ్‌ దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో నటించింది రష్మిక. అయితే కమర్షియల్ రోల్స్ లో అద్భుతంగా నటించి దూసుకుపోతున్న రశ్మికకు ఇది ఛాలెంజింగ్ రోల్ అంటున్నారు. మరి ఈ పాత్రలో రష్మిక నటన ఎలా ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న.. ప్రతిభావంతమైన దర్శక నిర్మాతలు ఆమెని ఎంపిక చేయడం ద్వారా అనుమానాలకు కాస్త అడ్డుకట్ట పడింది. ఈ పాత్రతో రష్మిక విమర్శకుల నోర్లు మూయించనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా గతేడాది డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 14కు షిఫ్ట్ అయ్యింది. సినిమా ట్రైలర్ జనవరి 22న రిలీజ్ కానుంది.

Snapinst.app_474572103_1262285241702247_4107442287663444100_n_1080.jpgSnapinst.app_474561073_910029767957834_4501820437804780486_n_1080.jpg


మంచి ఫామ్ లో ఉన్న రష్మికను 'పుష్ప' సినిమా ఎక్కడికో తీసుకెళ్లింది. తర్వాత ఆమె కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోకుండా అన్ని భాషల్లో టాప్ ప్రాజెక్ట్స్ కైవసం చేసుకున్నారు. ఇటీవల 'పుష్ప 2'తో హ్యుజ్ సక్సెస్ అందుకున్న ఆమె ప్రస్తుతం.. 'ఛావా'తో పాటు సల్మాన్ ఖాన్ 'సికందర్', శేఖర్ కమ్ముల 'కుబేర', రాహుల్ రవీంద్రన్ 'ది గర్ల్ ఫ్రెండ్', 'తామా' వంటి విభిన్నమైన ప్రాజెక్ట్స్ లో పని చేస్తుంది.

Also Read- Priyanka Chopra: చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో పూజలు.. ఉపాసనకు థ్యాంక్స్

Also Read- Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌ డిశ్చార్జ్.. హాస్పిటల్ బిల్ ఎంత అయిందో తెలుసా?

Also Read- Venu Swamy: సారీ చెప్పిన వేణు స్వామి.. ఇకపై అలా జరగదు!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 22 , 2025 | 09:59 AM