Rashmika Mandanna: సికిందర్ బీటీఎస్ విడుదల.. రష్మిక ఏమందంటే..
ABN , Publish Date - Mar 17 , 2025 | 01:36 PM
'సికందర్’ బీటీఎస్ (Sikandar BTS) వీడియో షేర్ చేసిన రష్మిక సల్మాన్ గురించి చెప్పిందంటే
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ (Salman khan) హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ (AR murugados) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సికందర్’ (Sikandar). ఇందులో సల్మాన్ సరసన రష్మిక (Rashmika Mandanna) కనిపించనున్నారు. ఇటీవల హోలీ సందర్భంగా ఈ సినిమా నుంచి ‘భం భం భోలే శంకర’ అనే పాటను విడుదల చేశారు. ఈ మధ్యనే విడుదల చేసిన పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఇందులో సల్మాన్, రష్మిక స్టెప్పులు అలరించాయి. మధ్యలో కాజల్ అగర్వాల్ తళుక్కున మెరిసింది. ఈ పాట మిలియన్‌ల వ్యూస్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఆ పాట బీటీఎస్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
'సికందర్’ బీటీఎస్ (Sikandar BTS) వీడియో షేర్ చేసిన రష్మిక సల్మాన్ గురించి మాట్లాడుతూ ‘‘సల్మాన్ ఖాన్ నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. సెట్‌లో ఎంతో ఎనర్జీతో ఉంటారు’ అని కామెంట్ చేశారు. ఈ కామెంట్ అభిమానుల్లో ఎనర్జీ, ఉత్సాహం పెంచింది. ఇక గతంలోనూ సల్మాన్ గురించి రష్మిక మాట్లాడారు. ుూఆయనతో నటించడం నా కల పెద్ద స్టార్ అయినా ఒదిగి ఉంటారు. షూటింగ్‌లో ఆరోగ్యం బాగా లేకపోతే ఇంటి నుంచి భోజనం తెప్పించేవారు’’ అని రష్మిక చెప్పారు. మురుగదాస్ డైరెక్షన్‌లో పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా ‘సికందర్’ తెరకెక్కుతోంది. ఇటీవల షూటింగ్ పూర్తయింది. రంజాన్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు.