Rakul Preet Singh: ఆయన పక్కన లేకపోతే... అందుకే అలా చేశా..

ABN , Publish Date - Feb 25 , 2025 | 10:06 AM

అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌ అగ్ర కథానాయికగా ఎదిగారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. స్టార్‌ హీరోలు అందరితోనూ ఆమె యాక్ట్‌ చేసింది. జాకీ భగ్నానీతో పెళ్లి తర్వాత పూర్తిగా ముంబై మకాం మార్చేసింది


అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌ అగ్ర కథానాయికగా ఎదిగారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), స్టార్‌ హీరోలు అందరితోనూ ఆమె యాక్ట్‌ చేసింది. జాకీ భగ్నానీతో (Jackky Bhagnani) పెళ్లి తర్వాత పూర్తిగా ముంబై మకాం మార్చేసింది. గతేడాది ఫిబ్రవరి 21న జాకీతో ఆమె పెళ్లి జరిగింది. ప్రేమ వివాహంతో ఒకటైన ఈ జంట ఇటీవలే తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే  షూటింగ్‌ సమయంలో తన భర్తను చాలా మిస్‌ అవుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేశారు.

Rakul.jpg

‘‘సినిమా షూటింగ్‌ సమయంలో మా ఆయనను బాగా మిస్‌ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. అయన పక్కన లేకపోతే చాలా కష్టంగా ఉంది. ఆ సమయంలో అతనికి దూరంగా ఉన్నాను అనే ఫీల్‌ను పోగొట్టుకోవడానికి ఆయన స్వెట్‌ షర్ట్స్‌ను ధరిస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ఓ సెల్ఫీ ఫొటోను పంచుకుంది రకుల్‌. అందులో ఆమె ‘జేబీ’ అనే పేరుతో భర్త పేరును సూచించే హుడి  ధరించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇటీవల మేరే హస్బెండ్‌ కే బీవీ’ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది రకుల్‌. తదుపరి ఆమె చేతిలో ఇండియన్‌ 3, దేదే ప్యార్‌ దే 2 చిత్రాలున్నాయి. తెలుగులో అయితే ఆమె సైన్‌ చేసిన సినిమా ఒకటీ లేదు.

Updated Date - Feb 25 , 2025 | 10:10 AM