Fashion: ప్రియాంక, కంగనా సందడి చేయడానికి రెడీ..
ABN , Publish Date - Mar 06 , 2025 | 02:31 PM
మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్థమైందీ Fashion సినిమా. దీంతో హీరోయిన్ల అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.
బాలీవుడ్ టాప్ హీరోయిన్‌లు ప్రియాంక చోప్రా (Priyanka Chopra), కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రల్లో నటించిన 'ఫ్యాషన్' (Fashion)చిత్రం 2008లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు జాతీయ అవార్డులను (national Awards) సాధించింది. ఉత్తమ నటిగా ప్రియాంక, ఉత్తమ సహాయనటిగా కంగనా అవార్డులు అందుకున్నారు. ఈ అగ్ర తారలు ఇద్దరూ మరోసారి తెరపై సందడి చేయనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్థమైందీ సినిమా. దీంతో హీరోయిన్ల అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. (Bollywood Movie Re Release trend)
మేఘనా మాథుర్ అనే మోడల్ చుట్టూ కథ తిరుగుతుంది. చిన్న పట్టణంలో పుట్టిన అమ్మాయి మోడల్‌గా ఎలా ఎదిగింది.. దాని తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఇందులో ఎంతోమంది మోడల్స్ కూడా నటించారు. ఈ సినిమాకు ముందు వరుస పరాజయాలతో ఉన్న ప్రియాంక కెరీర్ దీని తర్వాత మలుపు తిరిగింది. వరుస విజయాలు అందుకుంది. మధుర బండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆయనతోపాటు రోనీ స్క్రూవాలా నిర్మించారు.
‘ఫ్యాషన్’ రీరిలీజ్ గురించి రోనీ మాట్లాడుతూ.. గొప్ప కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ‘ఫ్యాషన్’ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాను రీరిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. రిలీజ్ సమయంలో వచ్చిన ఆదరణే ఇప్పుడు కూడా లభిస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. ఈ మహిళా దినోత్సవం రోజున ఫ్యాషన్‌తో పాటు ‘క్వీన్’, ‘హైవే’ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి.