Mythri Movie Makers: 'కిస్ కిస్ కిస్సక్'గా 'పింటూ కీ పప్పీ'

ABN , Publish Date - Mar 07 , 2025 | 03:57 PM

హిందీలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'పింటూ కీ పప్పీ' సినిమా ఇప్పుడు దక్షిణాది భాషల్లోనూ డబ్ అవుతోంది. ఇక్కడ ఈ సినిమాను 'కిస్ కిస్ కిస్సిక్' పేరుతో డబ్ చేసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మార్చి 21న విడుదల చేస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సమర్పణలో విధి ఆచార్య నిర్మించిన హిందీ చిత్రం 'పింటూ కీ పప్పి' (Pintu Ki Pappi). శివ్ హరే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుశాంత్ (Shushant), జాన్యా జోషి (Jaanyaa Joshi), విధి (Vidhii) కీలక పాత్రలు పోషించారు. విజయ్ రాజ్, మురళీశర్మ (Murali Sharma), సునీల్ పాల్, అలీ అస్గర్, అజయ్ జాదవ్, పూజా బెనర్జీ ఇందులో కీలక పాత్రలు చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్‌ ఆచార్య సైతం తెరపై కనిపించబోతున్నారు. 'పింటూ కీ పప్పీ' సినిమా నిజానికి ఫిబ్రవరి 21న విడుదల కావాల్సింది. కానీ ఇప్పుడు దానిని మార్చి 21కి వాయిదా వేశారు.


'పింటూ కీ పప్పీ'ని హిందీతో పాటు దక్షిణాది భాషల్లోకి అనువదించి, మార్చి 21నే విడుదల చేయబోతున్నారు. విశేషం ఏమంటే... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప -2' (Pushpa -2)లో శ్రీలీల (Sreeleela) నటించిన ఐటమ్ సాంగ్ 'కిస్ కిస్ కిస్సిక్' అనేది ఇంకా కుర్రకారు పెదాలపై నాట్యం చేస్తూనే ఉంది. దాంతో 'పింటూ కీ పప్పీ'ని సౌతిండియాలో 'కిస్ కిస్ కిస్సిక్' పేరుతోనే డబ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన హిందీ ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. తాజాగా ఇతర నాలుగు భాషలకు చెందిన ట్రైలర్స్ ను మార్చి 8న విడుదల చేయబోతున్నారు. రొమాంటిక్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన 'కిస్ కిస్ కిస్సిక్' యువతను ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.

Also Read: Sandal wood: సినిమా రంగంపై సీఎం ఇలా... డిప్యూటీ అలా...

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 07 , 2025 | 03:57 PM