NayanaThara: నయనతార డాక్యుమెంటరీ కేసు.. నెట్‌ఫ్లిక్స్‌కు కోర్టులో దెబ్బ

ABN , Publish Date - Jan 28 , 2025 | 02:19 PM

నానుమ్‌ రౌడీ దాన్‌’ విజువల్స్‌ను ‘నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో సంబంధిత నిర్మాణ సంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నయన్‌ దంపతులతోపాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్‌పైనా దావా వేసింది.


నయనతార: 'బీయాండ్‌ ద ఫెయిరీ టేల్‌’ (Nayanthara Beyond The Fairy Tale) డాక్యుమెంటరీ వివాదంపై నయనతార(Nayanthara), ధనుష్‌ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. నటి నయనతార, ఆమె భర్త డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌పై ధనుష్‌ కోర్టులో దావా వేశారు. పర్మిషన్‌ లేకుండా ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ విజువల్స్‌ను ‘నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో సంబంధిత నిర్మాణ సంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నయన్‌ దంపతులతోపాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్‌పైనా దావా వేసింది. అయితే ధనుష్‌ (DhanusH) దావాను సవాల్‌ చేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.




అసలు సంగతి ఏంటంటే..

నయనతార హీరోయిన్‌గా విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘నానుమ్‌ రౌడీ దాన్‌’. ధనుష్‌ ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే విఘ్నేశ్‌ - నయన్‌ల మధ్య ప్రేమ మొదలైంది. పెద్దల అంగీకారంతో 2022లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. నయన్‌ కెరీర్‌, ప్రేమ, పెళ్లిపై నెట్‌ఫ్లిక్స్‌ ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ పేరుతో డాక్యుమెంటరీ తీసింది. తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ వీడియోలు పాటలను ఇందులో చూపించాలని ఈ జోడీ భావించింది. కాకపోతే దానికి ధనుష్‌ నుంచి అంగీకరించలేదు. ఇటీవల డాక్యుమెంటరీ విడుదలైంది. అందులో సినిమాకు సంబంధించిన మూడు సెకన్ల ఫుటేజ్‌ వాడుకోవడంపై ధనుష్‌ లీగల్‌ నోటీసు పంపించారు. ధనుష్‌ పంపిన నోటీసులను సవాల్‌ చేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా నెట్‌ఫ్లిక్స్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

Updated Date - Jan 28 , 2025 | 02:23 PM