Plastic surgery effect: మౌనీరాయ్ ముఖం మారిపోయింది

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:35 PM

'నాగిన్' ఫేమ్ మౌనీరాయ్ ఇప్పుడు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తోంది. అయితే... ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమెను చూడగానే అభిమానులు హతాశయులయ్యారు. కారణం ఏమిటంటే...

సహజంగా మన హీరోయిన్లు అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీని ఉపయోగిస్తుంటారు. కానీ ఒక్కోసారి అది కాస్త వికటించి ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చిన మౌని రాయ్ (Mouni Roy) విషయంలో అదే జరిగింది. ఇప్పటికే పలుమార్లు మౌనిరాయ్ ప్లాస్టిక్ సర్జనీ చేయించుకుని తన అందాలకు మెరుగులు దిద్దుకుంది. అప్పుడంతా ఆహో, ఓహో అంటూ ఆమెకు కితాబులిచ్చారు. దాంతో మరోసారి అలాంటి ప్రయత్నమే చేసి భంగపడింది ఈ బాలీవుడ్ బ్యూటీ.


'కేజీఎఫ్ -2' (KGF -2) మూవీలో ఐటమ్ సాంగ్ చేసిన దక్షిణాది వారికీ చేరువైంది మౌనీ రాయ్. టీవీ సీరియల్స్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న మౌనిరాయ్ అందరిలానే సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తపించింది. దానికి తగ్గట్టుగానే ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. 'మేడిన్ చైనా, బ్రహ్మాస్త్ర' వంటి సినిమాల్లో నటించింది. అలానే మౌనిరాయ్ నటించిన తాజా చిత్రం 'భూత్నీ' ఏప్రిల్ 18న విడుదల కాబోతోంది. ఈ హారర్ మూవీలో సంజయ్ దత్, సన్నీసింగ్, పాలక్ తివారీ, నిక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేవలం నటనకే పరిమితం కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే మౌనీ రాయ్ కు సోనమ్ బజ్వా (Sonam Bajwa) , దిశా పటానీ (Disha Patani) మంచి స్నేహితులు. ఈ ముగ్గురూ కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు, పార్టీలూ చేసుకుంటారు. అయితే జనవరి 1నే మౌనిరాయ్ న్యూఇయర్ పార్టీకి వెళ్ళి తిరిగి వస్తూ ప్లాట్ ఫామ్ మీద కాలు స్లిప్ అయి పడితే, దిశా పటానీనే లేపి నుంచోపెట్టింది. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయిపోయింది.


ఇక ఇటీవల ప్రియుడిని పెళ్ళాడి లైఫ్ లో సెటిల్ అయిన మౌని రాయ్... తాజాగా తన స్నేహితురాళ్ళు సోనమ్ బజ్వా, దిశా పటానీతో కలిసి ఓ కమర్షియల్ ఈవెంట్ లో పాల్గొంది. అక్కడ ఆమెను వీరిద్దరితో కలిసి చూసిన నెటిజన్స్ కంగారు పడ్డారు. మౌనీరాయ్ కళ్ళకింద నల్లటి గీతలు కనిపించాయని కొందరంటే... ఆమె తాజాగా చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ వికటించినట్టుందని మరికొందరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అందగానే ఉన్న మౌనీరాయ్ మళ్ళీ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు చేయించుకోవడం? అని మరికొందరు ప్రశ్నించారు. 'క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ'తో నటిగా కెరీర్ ప్రారంభించిన మౌనీరాయ్ కు ఏక్తాకపూర్ తీసిన 'నాగిన్' సీరియల్ స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది. అక్కడ నుండి అమ్మడికి వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే... ఈ మధ్య ప్లాస్టిక్ సర్జరీని నమ్ముకుని ఇలాంటి పనులు చేస్తోందేమిటా? అనే అభిమానులు వాపోతున్నారు.

Also Read: Vijay Sethupathi: పూరి, ఛార్మి బలమైన బంధం...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 31 , 2025 | 12:36 PM