Mika singh: మరోసారి బిపాసా దంపతులపై ఫైర్ అయిన సింగర్
ABN , Publish Date - Mar 02 , 2025 | 01:40 PM
బాలీవుడ్ నటి బిపాసా బసు(Bipasa basu), ఆమెభర్త కరణ్ సింగ్ గ్రోవర్‌ను (Karan singh grover) ఉద్దేశించి గాయకుడు మికా సింగ్ (Mika singh) కీలక వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ నటి బిపాసా బసు(Bipasa basu), ఆమెభర్త కరణ్ సింగ్ గ్రోవర్‌ను (Karan singh grover) ఉద్దేశించి గాయకుడు మికా సింగ్ (Mika singh) కీలక వ్యాఖ్యలు చేశారు. వారి వల్ల తాను నష్టపోయానని ఆయన అన్నారు. ఎన్నో సందర్భాల్లో బాధపడ్డానని చెప్పారు. ఈరోజు ఆ జంట ఏ పనీ లేకుండా ఇంట్లోనే కూర్చొన్నారంటే అందుకు కారణం కర్మఫలమేనని తెలిపారు. (Mika singh fire)
‘‘బిపాసా బసు, కరణ్ గ్రోవర్ ప్రధాన పాత్రలో నటించిన ‘డేంజరస్’ వెబ్ సిరీస్‌కు నేను నిర్మాతగా వ్యవహరించా. అప్పటివరకూ మ్యూజిక్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న నాకు.. నిర్మాతగా మారాలనిపించింది. విక్రమ్ భట్‌ను సంప్రదించి ఒక కథ రాయించుకున్నా. దర్శకుడిగా భూషణ్ పటేల్‌ను ఎంపిక చేసుకున్నా. ఈ సిరీస్‌ను రూ.4 కోట్లలో చిత్రీకరించాలని బడ్జెట్ పెట్టుకున్నాం. బిపాసా దంపతుల వల్ల రూ.14 కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. షూట్ కోసం లండన్ వెళ్లాం. అక్కడ వారిద్దరూ ఎన్నో నాటకాలాడారు. ఒక రోజు ఆమెకు ఒంట్లో బాగోదు. మరో రోజు ఆయనకు ఒంట్లో బాగోదు. అలా, షూట్ చాలారోజులు వాయిదా వేస్తూ వచ్చాం. నిజ జీవితంలో భార్యభర్తలు కనుక.. సిరీస్ కోసం ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేస్తారనుకున్నాం. కానీ, ఆమె అలా కాదు. నేను ఇది చేయను, అది చేయనంటూ కండీషన్స్ పెట్టేది. వాళ్ల ప్రవర్తన చూసి నిర్మాణ రంగంలోకి ఎందుకు వచ్చానా అని బాధపడ్డా. వీళ్లు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటీనటులని నిర్మాతలను ఇదే విధంగా ఇబ్బంది పెడుతున్నారు. నిజం చెప్పాలంటే వాళ్లు నిర్మాతలను దేవుళ్లగా భావించాలి. కానీ అలా జరగడం లేదు. దేవుడు ఉన్నాడు. మనం చేసే పనులన్నీ చూస్తుంటాడని నేను నమ్ముతా. వాళ్లు ఆ రోజున నాకు చేసిన నష్టానికే ఈనాడు ఆ దంపతులకు ఏ పనీ లేకుండా పోయింది’’ అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అయితే బిపాసాను ఉద్దేశించి మికా సింగ్ ఈ విశమైన వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు.