Saif Ali Khan attack: బాంద్రా పోలీసులు పట్టేశారు
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:28 PM
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్(54)పై(Saif Ali Khan) దాడిచేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై(Saif Ali Khan) దాడిచేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫ్‌పై దాడి ఘటన గురించి సమాచారం అందుకున్న బాంద్రా పోలీసులు (Bandra Police) రంగంలోకి దిగారు. సుమారు 36 గంటల్లో అతన్ని బాంద్రా ప్రాంతంలోనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందుతుడిని పోలీసులు విచారిస్తున్నారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద అతనిపై పోలీసులు కేసు పెట్టారు. సైఫ్‌పై దాడి ఘటనలో మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో అతడిని పలు విషయాలపై ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు సైఫ్‌పై ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబం నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు చోరీకి యత్నించాడు. సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. కత్తిపోట్లకు గురైన ఆయనకు లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. మరోవైపు.. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.