Tamannaah: ప్రియుడితో బ్రేకప్.. తమన్నా ఏమన్నారంటే..
ABN , Publish Date - Mar 08 , 2025 | 05:02 PM
మిల్కీబ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ విడిపోయారంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.
మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah), నటుడు విజయ్ వర్మ (Vijay varma)విడిపోయారంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. ప్రేమ, రిలేషన్‌షిప్‌లపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. నిస్వార్థమైన ప్రేమను తాను నమ్ముతానని అన్నారు. ‘‘ప్రేమ, రిలేషన్‌షిప్‌కు అసలైన అర్థం తెలియక చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇద్దరి వ్యక్తుల మధ్య షరతులు ఎప్పుడు మొదలవుతాయో.. అక్కడ ప్రేమ అనేది ఉండదని నమ్ముతాను. ఎందుకంటే ప్రేమ నిస్వార్థమైనది. ఆ బంధంలో ఎలాంటి షరతులు ఉండవు. అది ఎప్పటికీ వన్‌సైడ్ లవ్‌లోనే ఉంటుంది. ప్రేమ అనేది భావోద్వేగాలతో కూడుకున్నది. ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలి? ఏం చేయాలనే విషయంలో నీకంటూ అంచనాలు ఏర్పడ్డాయంటే.. అది వ్యాపార లావాదేవీతో సమానం. నేను ఎవరినైనా ప్రేమిేస్త వారి భావాలకు స్వేచ్ఛను ఇవ్వాలి. వారిని వారిలా ఉండనివ్వాలనే విషయాన్ని గ్రహించాలి. రిలేషన్‌లో ఉన్నప్పుడు కంటే లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నాననిపిస్తుంది’’ అని తమన్నా తెలిపారు. భాగస్వామిని కలిగి ఉండటం అనేది ఓ మంచి అనుభూతి. భాగస్వామి ఎంపిక విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక చేశారు. (Tamannaah - Vijay varma)
2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’లో తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించారు. ఆ సమయంలో మొదలైన స్నేహః ప్రేమగా మారింది. ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఆ వారలపై ఇద్దరూ స్పందించలేదు. ప్రస్తుతం తమన్నా ఓదెల 2 చిత్రంలో నటిస్తున్నారు.