Kiss Kiss Kissik: ముద్దుల చిత్రంలో ఆధ్యాత్మిక గీతం
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:08 PM
'పింటు కీ పప్పీ' సినిమాను దక్షిణాది భాషల్లోనూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మార్చి 21న విడుదల చేయబోతోంది. ఇక్కడ ఈ సినిమాకు 'కిస్ కిస్ కిస్సిక్' అనే పేరు పెట్టారు. తాజాగా ఇందులోని డివోషనల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
సుశాంత్ (Shushant), జాన్యా జోషి (Jaanyaa Joshi) జంటగా నటించిన హిందీ సినిమా 'పింటు కీ పప్పీ' (Pintu Ki Pappi). శివ్ హరే దీనికి దర్శకుడు. విధి ఆచార్య నిర్మిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ ప్రెజెంట్ చేస్తోంది. ఇప్పుడీ సినిమాను మార్చి 21న హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. సౌతిండియాలో ఈ చిత్రానికి 'కిస్ కిస్ కిస్సిక్' (Kiss Kiss Kissik) అనే పేరు పెట్టారు. ఇప్పటికే తెలుగు వర్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు.
ALSO READ: Raasii khanna: యేడాది చివరిలో కెమెరా ముందుకు దొంగనోట్ల ముఠా
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తాజాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'కిస్ కిస్ కిస్సిక్' నుండి ఓ ఆధ్యాత్మిక గీతం విడుదలైంది. ఈ పాటలో సుశాంత్ తో పాటు స్టార్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య (Ganesh Acharya) సైతం వెండితెరపై మెరిశారు. శివోహం అంటూ సాగే ఈ గీతాన్ని సాయిరామ్ ముడుంబా రాశారు. షషాత్ అలీ స్వరాలు సమకూర్చిన దీనికి రాహుల్ సక్సెనా గాత్రదానం చేశారు. మరి ఈ రొమాంటిక్ మూవీలో డివోషనల్ సాంగ్ ను ఏ రీతిన చూపిస్తారో చూడాలి.
Also Read: Raasii khanna: యేడాది చివరిలో కెమెరా ముందుకు దొంగనోట్ల ముఠా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి