Kiran Korrapati: గని దర్శకుడి హిందీ సినిమా...
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:59 PM
'గని' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన కిరణ్ కొర్రపాటికి రెండో ఛాన్స్ హిందీలో దక్కింది. సాజిద్ ఖురేషీ నిర్మిస్తున్న సినిమాను కిరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 23న మొదలైంది.
తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ఇటీవలే 'జాట్' (Jaat) మూవీతో బాలీవుడ్ బాట పట్టాడు. సీనియర్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) హీరోగా నటించిన ఈ యాక్షన్ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవలే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరినట్టు నిర్మాతలు తెలిపారు. ఇదే సమయంలో తెలుగు సినిమా రంగానికి చెందిన యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటి (Kiran Korrapati) సైతం బాలీవుడ్ బాట పట్టడం విశేషం.
పలువురు ప్రముఖ దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన కిరణ్ కొర్రపాటి 2022లో వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా స్పోర్ట్స్ డ్రామా 'గని' (Ghani) సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ ఎంతో కష్టపడి మేకోవర్ చేశాడు. ఉపేంద్ర (Upendra), సునీల్ శెట్టి (Sunil Setty), జగపతి బాబు (Jagapathi Babu), నవీన్ చంద్ర (Naveen Chandra) కీలక పాత్రలు పోషించిన 'గని' సినిమా కమర్షియల్ గా ఆడలేదు. ఈ సినిమాతోనే సాయి మంజ్రేకర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా కిరణ్ కొర్రపాటికి హిందీ సినిమా చేసే ఛాన్స్ దక్కింది. ప్రముఖ దర్శక నిర్మాత సాజిత్ ఖురేఖీ (Sajid Qureshi) ప్రొడక్షన్ హౌస్ లో ఆరవ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఏప్రిల్ 23న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. లక్నో, ముంబై తదితర ప్రదేశాలలో షూటింగ్ జరుగనుంది. ఈ సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియచేయనున్నారు.
Also Read: Pahalgam: పాకిస్తానీ హీరో చిత్రానికి బాయ్ కాట్ సెగ...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి