Toxic: కుర్రకారుని కిర్రెక్కించే పాత్రలో కియారా
ABN , Publish Date - Apr 17 , 2025 | 07:55 PM
ప్రెగ్నెంట్ గా ఉన్న కియారా అద్వానీ 'టాక్సిక్' మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేస్తోందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. యశ్ తో పాటు కియారా చేసే పాత్ర కూడా 'టాక్సిక్'కు హైలైట్ కాబోతోందట.
పాన్ ఇండియా మూవీతో ఆల్ ఓవర్ ఇండియాను తన వైపుకు తిప్పుకున్నాడు హీరో యశ్. తన అప్ కమింగ్ మూవీ ని కూడా అది రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ సెట్స్ పై ఉన్న ఈ మూవీ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే తాజాగా హీరో కంటే కూడా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ కియారా గురించే చర్చ ఎక్కువ జరుగుతుండడం ఆసక్తి రేపుతోంది.
రాకింగ్ స్టార్ యాశ్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ 'టాక్సిక్' (Toxic). 'కె.జి.ఎఫ్- 2' తర్వాత యష్ (Yash) నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యశ్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) నటిస్తోంది. నయనతార (Nayanthara) , హుమా ఖురేషి (Huma Qureshi) వంటి టాప్ స్టార్లు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఎంతమంది ఉన్నప్పటికీ ఈ సినిమా టాక్ అంతా కియారా గురించే నడుస్తుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Ram Charan-Sandeep Vanga: క్రేజీ కాంబోలో మూవీ ఉందా... లేదా...
'టాక్సిక్' మూవీలో కియారా అద్వానీ యశ్ ప్రేమికురాలిగా కనిపించనుందని ఇప్పటిదాకా వినిపించింది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఆమె బోల్డ్ అవతార్‌లో కనిపించబోతోందన్నది టాక్. ఇది కియారా కెరీర్‌లోనే మోస్ట్ డేరింగ్ రోల్ అని అంటున్నారు. ఈ పాత్ర కోసం ఆమె స్పెషల్ ఫిజిక్‌ను కూడా డెవలప్ చేస్తోందని తెలుస్తోంది. కియారా పెర్ఫార్మెన్స్ ఈ మూవీలో హైలైట్‌గా నిలవనుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కియారా తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. దీంతో 'డాన్ 3' వంటి బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటికే 'టాక్సిక్' షూటింగ్‌ను ఆమె దాదాపు కంప్లీట్ చేసిందని అంటున్నారు. ఆమె ప్రెగ్నెన్సీ వల్ల సినిమా షెడ్యూల్‌కు ఎలాంటి ఆటంకం జరిగే ఛాన్స్ లేదని మేకర్స్ చెబుతున్నారు. యూనిక్ స్టోరీలైన్, టాలెంటెడ్ కాస్టింగ్ కారణంగా 'టాక్సిక్' ఈ ఏడాది మోస్ట్ ఎక్సైటింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలవనుంది. దీనికి తోడు కియారా బోల్డ్ రోల్ గురించిన బజ్ మూవీపై మరింత హైప్ ను క్రియేట్ చేసేలా ఉంది. యష్ ఫ్యాన్స్ కూడా 'టాక్సిక్' బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టి, ఇండస్ట్రీలో లాస్టింగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
Also Read: Sunny Deol: త్వరలో సెట్స్ పైకి జాట్ - 2
Also Read: Odela -2 Movie : ఓదెల 2 మూవీ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి