Khushi kapoor: అక్కకు, నాకూ పోటీనా.. ఏమనుకుంటున్నారు..

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:41 PM

‘‘మీ జీవితానికి సంబంధించి ఎలాంటి రొమాంటిక్‌ మూమెంట్‌ను ఫొటో తీసుకోవాలనుకుంటున్నారు?’’ అని ప్రశ్నించగా.. ‘‘ప్రత్యేకంగా అలాంటిది ఏమీ లేదు' అని ఖుషి అన్నారు

దివంగత నటి, అతిలోకసుందరి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ (Khushi kapoor), ఆమిర్‌ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ జంటగా నటించిన చిత్రం ‘లవ్‌యాపా’ (Love Yapa). యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. తాజాగా ఖుషీ ఓ ఇంటర్వ్యూ ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని చెప్పారు. ‘‘మీ జీవితానికి సంబంధించి ఎలాంటి రొమాంటిక్‌ మూమెంట్‌ను ఫొటో తీసుకోవాలనుకుంటున్నారు?’’ అని ప్రశ్నించగా.. ‘‘ప్రత్యేకంగా అలాంటిది ఏమీ లేదు. ప్రపోజల్‌కు సంబంధించిన మూమెంట్‌ను ఫొటో తీసుకోవాలని ఉంది. అది ఎంతో ప్రత్యేకం కాబట్టి’’ అని బదులిచ్చారు. ‘‘ఎవరికేౖనా ప్రపోజ్‌ చేశారా?’’ అని ప్రశ్నించగా ‘‘నేను ఇప్పటివరకూ ఎవరికీ ప్రపోజ్‌ చేయలేదు’’ అని చెప్పారు.  ‘ది ఆర్చిస్‌’ కోస్టార్‌ వేదాంగ్‌ రైనాతో ఖుషి ప్రేమలో ఉందంటూ వార్తలే వచ్చిన సంగతి తెలిసిందే.  

Khushi.jpg

కెరీర్‌ పరంగా జాన్వీకపూర్‌తో((Janhvi Kapoor) పోటీ గురించి అడగగా ‘‘ఆ ఆలోచన మా ఇద్దరికీ లేదు. మేము పోటీ పడుతున్నామని అనుకోవడం వింతగా ఉంది. ఒకవేళ మేమిద్దరం కలిసి ఒకే చిత్రంలో యాక్ట్‌ చేేస్త.. తను నాకంటే బాగా చేయొచ్చు. దానిని కూడా నేను నా విజయంగానే అనుకుంటా.. అక్క కూడా అంతే. నేను ఏదైనా చిత్రంలో బాగా నటించి ప్రశంసలు అందుకుంటే అది తన విజయంగా భావిస్తుంది. అంతేకానీ మా మధ్య పోటీ ఉంటుందని మేము ఎప్పుడూ అనుకోము’’ అనిఅన్నారు.

ప్రదీప్‌ రంగనాథన్‌ స్వీయ దర్శకత్వంలో తమిళంలో సూపర్‌హిట్‌ అందుకున్న చిత్రం ‘లవ్‌ టుడే’. దీనికి రీమేక్‌గా ‘లవ్‌ యాపా’ తెరకెక్కింది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించారు. ప్రదీప్‌ రంగనాథన్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఫిబ్రవరి 7న విడుదల కానుంది.  

Updated Date - Jan 25 , 2025 | 12:44 PM