Baby John Ott: బేబీ జాన్ భలే ఆఫర్
ABN , Publish Date - Feb 19 , 2025 | 01:08 PM
బేబీ జాన్’ గత డిసెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షఖుల ముందుకొచ్చింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ర్టీమింగ్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాను చూడాలంటే రూ. 349 రెంట్ చెల్లించాల్సి ఉంది.
వరుణ్ ధావన్(Varun Dhavan), కీర్తి సురేశ్(Keerthy Suresh) కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'బేబీ జాన్’ గత డిసెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షఖుల ముందుకొచ్చింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా స్ర్టీమింగ్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాను చూడాలంటే రూ. 349 రెంట్ చెల్లించాల్సి ఉంది. కాని, బుధవారం నుంచి ఈ సినిమాను ఉచితంగా చూసే అవకాశం కల్పించింది అమెజాన్. హిందీ, తమిళ్, తెలుగుతోపాటుు 9 భాషల్లో సబ్ టైటిల్స్‌తో ఈ సినిమాను చూడొచ్చు.
కాలీస్ (Kalis) దర్శకత్వం వహించిన చిత్రమిది. ‘బేబీ జాన్’తో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేశ్. అందుకు కారణం సమంతే అని తెలిపింది. ‘తెరి’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. దీని తమిళ వెర్షన్‌లో హీరోయిన్‌గా సమంత నటించారు. దీన్ని రీమేక్ చేయాలని మేకర్స్ భావించినప్పుడు కీర్తిని తీసుకోవాలని సమంత సలహా ఇచ్చారట. అలా తనకు ‘బేబీ జాన్’ అవకాశం వచ్చిందని కీర్తి సమంతకు (Samantha) కృతజ్ఞతలు తెలిపారు. తమిళంలో సమంత నటించిన పాత్రను హిందీలో నటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు కీర్తి.
బేబీ జాన్ కథ:
తన కుమార్తె ఖుషీతో కలిసి కేరళలో ఓ మారుమూల గ్రామంలో జీవిస్తుంటాడు జాన్ (వరుణ్). బేకరీ నడపుతూ సంతోషంగా బతుకుతుంటారు. ఖుషీ టీచర్ తారతో జాన్‌కు స్నేహం ఏర్పడుతుంది. చివరకు ఆమె జాన్‌పై ప్రేమ పెంచుకుంటుంది. తార రూపంలో ఈ తండ్రీ కుమార్తెలకు ఓ ప్రమాదం ఎదురవుతుంది. ఆమె వల్ల కలిగిన ఇబ్బందులను బేబీ జాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అసలు అందరికీ దూరంగా మారుమూలన ఎందుకు ఉంటున్నాడు? అతడి గతం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.