Keerthy Suresh: నువ్వేనా.. నేను కూడా ఆటాడిస్తా..
ABN , Publish Date - Mar 21 , 2025 | 05:38 PM
పలు షాపింగ్ మాల్స్‌కి ఐస్‌క్రీమ్ తిందామని వెళ్తే, ఆ షాపులో ఐస్‌క్రీమ్ సర్వ్ చేసేవారు దాన్ని ఇవ్వకుండా ఆటపట్టించే వీడియోలు చాలా చోట్ల చూస్తుంటాం.
పలు షాపింగ్ మాల్స్‌కి ఐస్‌క్రీమ్ తిందామని వెళ్తే, ఆ షాపులో ఐస్‌క్రీమ్ సర్వ్ చేసేవారు దాన్ని ఇవ్వకుండా ఆటపట్టించే వీడియోలు చాలా చోట్ల చూస్తుంటాం. జనరల్‌గా టర్కిష్ ఐస్‌క్రీమ్ అమ్మే వ్యక్తులు చేేస ఈ గారడీ కొందరికి విసుగు తెప్పిస్తే (Keerthy Suresh Ice cream) మరికొందరికి సరదాగా ఉంటుంది. చిన్నారుల దగ్గరి నుంచి యువత వరకూ ఎవరినైనా ఆటపట్టిస్తుంటారు. ఐస్‌క్రీమ్ ఇచ్చినట్టే ఇచ్చి, ఓ ఆటాడుకుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే నటి కీర్తి సురేశ్‌కు (Keerthy Suresh) ఎదురైంది. ఐస్‌క్రీమ్ అమ్మేవ్యక్తి చాలా సేపు కీర్తి సురేశ్‌ను ఆటపట్టించాడు. ఆ తర్వాత యథావిధిగా ఇచ్చేశాడు. ఇక ఆ తర్వాత కీర్తి వంతు వచ్చింది.
తీసుకున్న ఐస్‌క్రీమ్‌కు డబ్బులు ఇవ్వబోతూ వాళ్ల టెక్నిక్‌నే వాళ్లపై ప్రయోగించింది. డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి, అటూ ఇటూ తిప్పుతూ వాళ్లను ఆటపట్టించింది. ‘జస్ట్ ఫర్ ఫన్’ అంటూ ఈ వీడియోను కీర్తి సురేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పంచుకుంది. ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన కీర్తిసురేశ్ తన చిరకాల స్పేమితుడు ఆంటోనీ తటిల్‌ను పెళ్లి చేసుకుంది. సినిమా విషయాలకొస్తే ఇటీవల ‘బేబీ జాన్’తో బాలీవుడ్‌ను పలకరించింది. ఇప్పుడు ‘రివాల్వర్ రీటా’, ‘కన్నివేడి?’ చిత్రాలతో సందచి? చేయడానికి సిద్థమవుతోంది.