Sreeleela: కార్తిక్‌తో శ్రీలీల డేటింగ్.. తల్లి ఏమన్నారంటే..
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:02 PM
ఇలా సినిమా ఓకే అయింతో లేదో శ్రీలీలపై గాసిప్పులు పుట్టుకొచ్చాయి. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందనీ, డేటింగ్ చేస్తుందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న తెలుగు నాయకి శ్రీలీల(Sreeleela) . గత ఏడాది వరుస చిత్రాలతో బిజీగా ఉంది. అలాగే పరాజయాలు చవిచూసింది. అయినా ఆఫర్లకు కొదవేం లేదు. ఇప్పుడు కూడా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అరడజను సినిమాలున్నాయి. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్ (Karthik Aryan) హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో శ్రీలీల బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఇలా సినిమా ఓకే అయింతో లేదో శ్రీలీలపై గాసిప్పులు పుట్టుకొచ్చాయి. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందనీ, డేటింగ్ చేస్తుందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కార్తిక్‌తో కలిసి ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల పాల్గొనడంతో ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. ఇదిలా ఉండగా, తమ ఇంటికి ఎలాంటి అమ్మాయి కోడలిగా రావాలో తెలియజేస్తూ కార్తిక్ ఆర్యన్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఐఫా’ వేడుకల్లో పాల్గొన్న ఆమెను నిర్మాత కరణ్‌జోహార్ కాబోయే కోడలి గురించి ప్రశ్నించారు. ‘‘ఒక మంచి వైద్యురాలు మా ఇంటికి కోడలిగా రావాలని మేమంతా కోరుకుంటున్నాం’’ అని ఆమె అన్నారు. (SreeleelaDating)
హీరోయిన్‌గా మోస్ట్ వాటెండ్ హీరోయిన్‌గా మారిన శ్రీలీల సినిమాలు చేస్తూనే ఎంబీబీఎస్ చదువుతోంది. కార్తిక్ - శ్రీలీల డేటింగ్‌లో (SreeleelaRumors) ఉన్నారంటూ ప్రచారం జరుగుతోన్న వేళ హీరో తల్లి వ్యాఖ్యలు వాటికి మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. శ్రీలీలను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే అనురాగ్ బసు సినిమా కోసం కలిసిన వీరిద్దరూ షూటింగ్‌లో క్లోజ్ అయ్యారని, డేటింగ్‌లో ఉన్నారని కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం వాళ్లది కేవలం స్నేహం మాత్రమేనని.. ఆ ేస్నహంతోనే ఆమెను ఆయన ఇంటికి ఆహ్వానించారని అనుకుంటున్నారు. అయితే ఈ గాసిప్పులపై శ్రీలీల ఎక్కడా స్పందించలేదు.