Kangana Ranaut: హిమాలయాల్లో బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్ హీరోయిన్..
ABN , Publish Date - Feb 05 , 2025 | 01:55 PM
‘‘నా చిన్ననాటి కల ఎట్టకేలకు ప్రాణం పోసుకుంది. హిమాలయాల ఒడిలో నా చిన్న కేఫ్. ది మౌంటెన్ స్టోరీ.. ఇదొక ప్రేమకథ’’ అంటూ క్యాప్షన్ రాశారు. దీంతో ఫ్యాన్స్ అందరు ఆశ్చర్యపోతూ.. అభినందిస్తున్నారు. ఈ రెస్టారంట్..
హిమాలయ పర్వతా ప్రాంతాల్లో ఒక్కసారైనా పర్యటించాలనేది చాలా మంది చిరాకాల కోరిక. మరికొందరు లైఫ్ లో అక్కడే ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడే జీవితాంతం స్పెండ్ చేయాలని కోరుకుంటారు. కానీ.. ఓ నటి హిమాలయాల్లో బిజినెస్ స్టార్ట్ చేసింది. అది తన చిన్ననాటి కల అని చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ బిజినెస్ లో శిల్పాశెట్టి, మలైకా అరోరా, మౌనీరాయ్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ హీరోయిన్లు ఉన్నా.. ఈమె స్టార్ట్ చేసిన బిజినెస్ వెరీ స్పెషల్.
తాజాగా బాలీవుడ్ యాక్ట్రెస్, ఎంపీ కంగనా రనౌత్ తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికరమైన పోస్టులను షేర్ చేసింది. ఆమె హిమాలయాల్లో ‘ది మౌంటైన్ స్టోరీ’ పేరుతో ఓ కేఫ్ ని స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె రెస్టారంట్ ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలకు ఆమె ‘‘నా చిన్ననాటి కల ఎట్టకేలకు ప్రాణం పోసుకుంది. హిమాలయాల ఒడిలో నా చిన్న కేఫ్. ది మౌంటెన్ స్టోరీ.. ఇదొక ప్రేమకథ’’ అంటూ క్యాప్షన్ రాశారు. దీంతో ఫ్యాన్స్ అందరు ఆశ్చర్యపోతూ.. అభినందిస్తున్నారు. ఈ రెస్టారంట్ ఫిబ్రవరి 14 నుండి ప్రారంభం కానుంది. ఇందులో మోడ్రన్ అభిరుచులకు అనుగుణంగా నేటివ్ ఫుడ్ లభించనుంది.
ఇది ఇలా ఉంటే ఎన్నో వివాదాల అనంతరం రిలీజ్ అయినా కంగనా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎమెర్జెన్సీ' మూవీ క్రిటిక్స్ తో పాటు ఆడియెన్స్ ని మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. ప్రస్తుతం ఆమె మాధవన్‌తో కలిసి ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌లో థ్రిల్లర్ తో పాటు ‘తను వెడ్స్ మను 3’ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉంది.