Kangana Ranaut: కంగనా 'ఎమర్జెన్సీ' బ్యాన్
ABN , Publish Date - Jan 15 , 2025 | 09:31 AM
Kangana Ranaut: కొన్ని ప్రదేశాల్లో ఈ సినిమా బ్యాన్ కానుంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై వివాదాస్పదంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడం ప్లస్ మరికొన్ని అంశాలు ఈ సినిమాను బ్యాన్ అయ్యే విధంగా చేస్తున్నాయి. ఇంతకీ ఆ ఇతర అంశాలు ఏంటి? ఎక్కడ బ్యాన్ చేయనున్నారంటే..
కంగనా రనౌత్ (Kangana Ranaut) నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ (Emergency)’. ఇప్పటికే ఈ పలుమార్లు విడుదల వాయిదా పడింది. కాగా, ఎన్నో వివాదాల మధ్య ఈ చిత్రం జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రదేశాల్లో ఈ సినిమా బ్యాన్ కానుంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై వివాదాస్పదంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడం ప్లస్ మరికొన్ని అంశాలు ఈ సినిమాను బ్యాన్ అయ్యే విధంగా చేస్తున్నాయి. ఇంతకీ ఆ ఇతర అంశాలు ఏంటి? ఎక్కడ బ్యాన్ చేయనున్నారంటే..
ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం భారత్-బంగ్లా మధ్య ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు బాంగ్లాదేశ్ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించిన 'ఇందిరా గాంధీ'పై ప్రత్యేక ఎజెండాతో తీస్తున్న సినిమా కాబట్టి విడుదల కష్టమే అంటున్నారు. కంగనా ఈ సినిమాలో ఇందిరాగాంధీగా నటించగా అనుపమ్ ఖేర్ జయప్రకాశ్ నారాయణ్‌గా, శ్రేయాస్ తల్పడే వాజపేయి పాత్రల్లో నటించారు.
ప్రియాంక గాంధీకి ఆహ్వానం..
ఎమర్జెన్సీ చిత్రం చూడమని ఎంపీ ప్రియాంక గాంధీని ఆహ్వానించినట్లు బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ తెలిపారు. ఆమె సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇందిరాగాంధీకి ప్రియాంక మనవరాలు కావడంతో అందరికన్నా ముందుగా ఆమెకు ‘ఎమర్జెన్సీ’ సినిమా చూపిస్తే బావుంటుందనిపించింది. ఈ మధ్య పార్లమెంట్‌లో ప్రియాంక గాంధీని కలిశాను. మీరు తప్పకుండా ‘ఎమర్జెన్సీ’ చిత్రం చూడాలి. మీకు బాగా నచ్చుతుంది అని కోరాను. ‘అవును నచ్చొచ్చు, వీలు చూసుకొని సినిమా చూస్తాను’ అని ప్రియాంక గాంధీ చెప్పారు’’ అని కంగనా రనౌత్ తెలిపారు.