Kangana Ranaut: అలా చేస్తే  చివరకు ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:25 AM

బాలీవుడ్‌ సినిమాల్లో వివాహ వ్యవస్థను, ఉమ్మడి కుటుంబాలను చెడ్డగా చూస్తున్నారని బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌, ఎంపీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) పరోక్ష విమర్శలు చేశారు.


బాలీవుడ్‌ సినిమాల్లో వివాహ వ్యవస్థను, ఉమ్మడి కుటుంబాలను చెడ్డగా చూస్తున్నారని బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌, ఎంపీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) పరోక్ష విమర్శలు చేశారు. సన్యా మల్హోత్ర (Sanya malhotra) నటించిన తాజా చిత్రం ‘మిసెస్‌’ (MRS). జీ5 (ZEE5) ఓటీటీ వేదికగా
స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఉద్దేశించి ఆమె కామెంట్‌ చేశారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉండే పెద్దలను తప్పుగా చూపించడం మానుకోవాలని తన అభిప్రాయాన్ని తెలిపారు.  

Mrs.jpg

ఆమె మాట్లాడుతూ ‘‘ఉమ్మడి కుటుంబాల్లో ఉండే పెద్దల గురించి చెప్పాలంటే.. వారు కుటుంబానికి మానసిక ఽధైర్యాన్ని ఇస్తుంటారు. ఎన్నో విలువైన విషయాలు చెబుతుంటారు మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో సందేహం లేదు. బాలీవుడ్‌లో వచ్చే ప్రేమ కథా చిత్రాలు వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని తగ్గించేలా చిత్రీకరిస్తున్నారు. జీవితం చాలా చిన్నది. మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు  వెళ్లాలి. గుర్తింపు కోసం ఎక్కువగా పోరాటం చేస్తే చివరకు ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది’’ అని ఆమె రాసుకొచ్చారు. ‘గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ చిత్రం ఆధారంగా ఇప్పటికే తమిళం, తెలుగులో ఈ సినిమా వచ్చింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘మిసెస్‌’ పేరుతో రీమేక్‌ చేశారు. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ సినిమాను తీశారు.  

Updated Date - Feb 24 , 2025 | 11:27 AM