Kangana Ranaut: కాజోల్, దీపికా ముద్దు.. మేమంటే చేదు
ABN , Publish Date - Jan 30 , 2025 | 03:23 PM
Kangana Ranaut: "ఇండస్ట్రీలో ఆమె రంగులో ఉన్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ మీరు ఇలానే అభిమానిస్తున్నారా? కాజోల్, దీపికా పదుకొణె వంటి నటీమణులపై చూపిన ప్రేమాభిమానాలే కొత్త హీరోయిన్లపై కూడా చూపిస్తున్నారా?"
తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పై ఎదో ఒక కామెంట్స్ చేస్తూ.. వార్తల్లో నిలిచే ఆమె ఈ సారి కుంభమేళా ఫేమ్ మోనాలిసా గురించి మాట్లాడుతూ.. ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు. ప్రయాగ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలలో తేనె కళ్ళు, ఆకర్షణీయమైన అందంతో వీక్షకులను మోనాలిసా ఆకర్షించింది. దీంతో పలువురు ఆమెతో వీడియోలో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. అనంతరం జనాలు ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు విచ్చలవిడిగా వచ్చారు. ఈ కారణంగా ఆమె తీవ్ర ఇబ్బందిని ఎదురుకోవడంతో పాటు బాలీవుడ్ మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కంగనా మాట్లాడుతూ.. ‘‘తన సహజ సౌందర్యంతో ఇంటర్నెట్‌లో సంచలనంగా మారిన మోనాలిసాతో ఫొటోలు దిగేందుకు కొందరు ప్రవర్తించిన తీరు నన్ను బాధించింది. నేను వారిని ద్వేషించడం తప్ప ఏం చేయగలను. ఇండస్ట్రీలో ఆమె రంగులో ఉన్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ మీరు ఇలానే అభిమానిస్తున్నారా? కాజోల్, దీపికా పదుకొణె వంటి నటీమణులపై చూపిన ప్రేమాభిమానాలే కొత్త హీరోయిన్లపై కూడా చూపిస్తున్నారా? మోనాలిసాను గుర్తించినట్లు అలాగే ఉన్న కొత్తవారిని ఎందుకు గుర్తించరు?’’ అంటూ కంగనా తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు.
ఇక కుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసా.. జనాల తాకిడి తట్టుకోలేక తన స్వస్థలం ఇందౌర్‌కు వెళ్ళిపోయింది. ఇది ఇలా ఉంటే ఎన్నో వివాదాల అనంతరం రిలీజ్ అయినా కంగనా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎమెర్జెన్సీ' మూవీ క్రిటిక్స్ తో పాటు ఆడియెన్స్ ని మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. ప్రస్తుతం ఆమె మాధవన్‌తో కలిసి ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌లో థ్రిల్లర్ తో పాటు ‘తను వెడ్స్ మను 3’ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉంది.