Janhvi Kapoor: జాన్వీతో స్టార్ క్రికెటర్ డేటింగ్.. నిజమెంత?
ABN , Publish Date - Jan 13 , 2025 | 02:42 PM
Janhvi Kapoor: సోషల్ మీడియా పీక్స్‌కి చేరుకున్న తర్వాత సెలబ్రిటీలకు ప్రైవసీ కరువైంది. అంతే కాకుండా ఫేక్ న్యూస్ మరో పెద్ద తలనొప్పిగా మారాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ డేటింగ్‌లో ఉన్నా వార్తల్లో కాస్త నిజమున్నట్లే అనిపించినా.. ఆమె ఇంకో క్రికెటర్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుందా?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రిలేషన్షిప్ ఎప్పుడు హాట్ టాపిక్ గానే మారుతుంది. ఇప్పటికే ఆమె పెళ్లి కూడా ఫిక్స్ అయ్యిందని చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే జాన్వీ తాజాగా ఇండియన్ క్రికెట్ టీమ్ కి చెందిన స్టార్ క్రికెటర్ తో మాల్దీవ్స్ లో రోమాన్స్ చేస్తున్నట్లు ఫోటోలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్టార్ క్రికెటర్ ఎవరు? వాళ్ళు నిజంగానే డేటింగ్ లో ఉన్నారా? ఇంతకీ ఏం జరిగిందంటే..
జాన్వీ కపూర్‌తో హార్దిక్ పాండ్యా పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని.. వాళ్లిద్దరూ ఈ మధ్యే మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో జాన్వీ-పాండ్యా సముద్ర తీరంలో విహరిస్తూ, సన్నిహితంగా కనిపించడంతో చాలా మంది నెటిజన్స్ ఇది నిజమేనని అనుకున్నారు. అయితే దీనిపై నేషనల్ మీడియా ఫ్యాక్ట్ చెక్ నిర్వహించగా ఫేక్ అని తేలింది. ఈ ఫొటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్రియేట్ చేసినవి అని బయటపడింది. దీంతో డేటింగ్ వార్తలు ఒట్టి పుకార్లేనని క్లారిటీ వచ్చేసింది.
జాన్వీకి ఇంకా పెళ్లి కాని విషయం తెలిసిందే. ఆమె వరుస సినిమాలు చేస్తూ మరింత బిజీ అవుతోంది. ‘దేవర’ తర్వాత తెలుగులో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సరసన క్రేజీ ప్రాజెక్ట్‌లో శ్రీదేవి కూతురు నటిస్తోంది. ‘ఆర్సీ 16’గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ పనులు జోరందుకున్నాయి. మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా వరుస క్రికెట్‌తో బిజీగా ఉన్నాడు. భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులతో ఆ మధ్య బాగా వార్తల్లో నలిగాడు పాండ్యా. ఐపీఎల్-2024 సమయంలో కెప్టెన్సీ కాంట్రవర్సీ, భార్యతో విడాకులు.. ఇలా వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాడు. అయితే టీ20 వరల్డ్ కప్ విజయంతో హార్దిక్ వాటన్నింటినీ అధిగమించి అందరి మనసులు గెలుచుకున్నాడు. తిరిగి పాజిటివిటీ వైపు నడుస్తూ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాడు.