Janhvi Kapoor: జాన్వీ కపూర్ కండోమ్ యాడ్‌కు పర్ఫెక్ట్.. కండోమ్ సంస్థ అధినేత

ABN , Publish Date - Feb 01 , 2025 | 05:15 PM

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌పై ఓ కండోమ్ కంపెనీ అధినేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మ్యాన్‌కైండ్ కంపెనీ నుండి వచ్చే మ్యాన్‌ఫోర్స్ కండోమ్ యాడ్‌కు జాన్వీకపూర్ అయితే పర్ఫెక్ట్‌‌గా సరిపోతుందనేలా, ఆ కంపెనీ సీఈఓ చేసిన వ్యాఖ్యలపై జాన్వీ అభిమానులు మండిపడుతున్నారు. అసలు మ్యాన్‌కైండ్ అధినేత ఏమన్నారంటే..

Janhvi Kapoor

అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌పై ఓ కండోమ్ కంపెనీ అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు చేసిన సదరు అధినేతపై జాన్వీ కపూర్ అభిమానులు మండిపడుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే నటిగా నిలదొక్కుకుంటోంది. బాలీవుడ్‌లో ఆమె చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాకపోవడంతో.. సౌత్‌పై కన్నేసిన ఆమె.. ఇక్కడ వరుస అవకాశాలను దక్కించుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారారు. ఇటీవల ఆమె నటించిన ‘దేవర’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ వెంటనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఆర్‌సి16’లోనూ హీరోయిన్‌గా సెలక్ట్ అయింది. సౌత్‌లో మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.


Also Read- Kiss Scene: ఆ ముద్దు సీన్ ట్రిమ్ చేశారు.. పాపం పూజా హెగ్డే?

శ్రీదేవి తరహాలోనే సౌత్‌లో స్టార్ హీరోయిన్ దిశగా దూసుకెళుతున్న ఆమెపై.. ఓ కండోమ్ కంపెనీ అధినేత తాజాగా కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ప్రముఖ ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్ ఫౌండర్ రాజీవ్ జునేజా.. తాజాగా రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో ప్రసంగించారు. ఈ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. తన కంపెనీ నుండి వచ్చే మ్యాన్‌ఫోర్స్ కండోమ్ యాడ్‌కు జాన్వీకపూర్ అయితే పర్ఫెక్ట్‌‌గా సరిపోతుందనేలా కామెంట్స్ చేశారు. హీరోయిన్స్‌లో జాన్వీ కపూర్, హీరోలలో రణ్‌బీర్ కపూర్ అయితే తమ కంపెనీ కండోమ్ యాడ్‌కు పర్ఫెక్ట్ ఫిగర్స్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.


Also Read- Kumbh Mela Monalisa: ‘కుంభమేళా’ మోనాలిసా ఇంటికి వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం.. రీల్స్‌ నుండి రియల్ తెరకు!

ఇంతకు ఇదే కంపెనీకి సన్నీలియోన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేవారు. ఆమె తర్వాత బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. సన్నీలియోన్‌ని కాదని కార్తీక్ ఆర్యన్‌ను ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకోవడానికి కారణం.. కండోమ్ విషయంలో మహిళలే కాదు.. పురుషులు కూడా ముఖ్యమే అని చెప్పడం కోసమే. లైంగిక చర్యలకు అవతలి వ్యక్తి అనుమతి ముఖ్యమని చెప్పడంలో కార్తీక్ ఆర్యన్, మ్యాన్‌ఫోర్స్ విజయం సాధించాయని రాజీవ్ జునేజా చెప్పుకొచ్చారు.


Ranbir-Kapoor.jpg

Also Read- NBK: పదవులు మనకు అలంకారం కాదు.. మనమే ఆ పదవులకు అలంకారం కావాలి

కార్తీక్ ఆర్యన్ కాకుండా మరో సెలబ్రిటీ ఎవరైతే ఈ యాడ్‌కు బాగుంటారనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘కండోమ్ యాడ్ కోసమే కాదు.. మరే ఇతర యాడ్ కోసమైనా జాన్వీ కపూర్ పర్ఫెక్ట్‌గా సూటవుతుంది. ఆమె అందరి కంటే బెస్ట్ ఛాయిస్’’ అని రాజీవ్ జునేజా స్పష్టం చేశారు. మేల్ యాక్టర్స్‌లో అయితే రణ్‌బీర్ కపూర్, లక్ష్య రాఘవ్ (‘కిల్’ మూవీ ఫేమ్) అయితే బాగుంటారని అన్నారు. ఇంకా తమ కంపెనీ నుండి వచ్చే ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ కిట్ యాడ్ కోసం అయితే అనుష్క శర్మ లేదంటే దీపికా పదుకునే బాగుంటారని రాజీవ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Also Read- Kollywood Directors: కోలీవుడ్‌ డైరెక్టర్లు.. భయపడుతున్న టాలీవుడ్‌ హీరోలు!

Also Read- Pushpa 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘పుష్ప 2 రీ లోడెడ్’.. నీ యవ్వ ఇక తగ్గేదే లే..

Also Read- Raghava Lawrence Kanchana 4: ‘కాంచన 4’.. కత్తిలాంటి ఫిగర్‌ని పట్టిన లారెన్స్

Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 01 , 2025 | 05:15 PM