Sunny Deol: 'జాట్' డబ్బింగ్ మొదలెట్టిన రణదీప్ హుడా
ABN , Publish Date - Feb 19 , 2025 | 06:31 PM
సన్నీ డియోల్ హీరోగా మలినేని గోపీచంద్ తెరకెక్కిస్తున్న హిందీ చిత్రం 'జాట్' డబ్బింగ్ కార్యక్రమాలు షురూ అయ్యాయి.
బాలీవుడ్ లెజెండ్ సన్నీ డియోల్ (Sunny Deol), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'జాట్' (Jaat). దీనిని తెలుగు చిత్రసీమకు చెందిన రెండు ప్రతిష్ఠాత్మక సంస్థలు మైత్రీ మూవీమేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న 'జాట్' మూవీ డబ్బింగ్ ను మేకర్స్ ప్రారంభించారు. ఈ సినిమాలో కీలక పాత్రను పోషించిన రణదీప్ హుడా (Randeep Hooda)తో ఈ పని మొదలైంది. అతనితో పాటుగా 'జాట్'లో వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కాసాండ్రా (Regina Cassandra) కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన 'జాట్' టీజర్ ను చూస్తే ఇది మోస్ట్ బ్లాస్ట్ యాక్షన్ డ్రామా అనే విషయం అర్థమౌతోంది. ఈ మూవీని ఏప్రిల్ 10న జాతీయస్థాయిలో విడుదల చేయబోతున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అనల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు.