Saif Ali Khan’s attacker: నిందితుడు ప్లాన్‌ వర్కవుట్‌ అయింది కానీ..

ABN , Publish Date - Jan 22 , 2025 | 04:58 PM

బాంద్రాలోని సైఫ్‌ ఇంటికి నిందితుడిని తీసుకువెళ్లి.. దాడి ఎలా చేశాడనే విషయాలు తెలుసుకున్నారు.

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై (Saif Ali Khan) దాడి కేసులో షరీఫుల్‌ షెహజాద్‌ (Attacker Shariful Shehzad) అనే వ్యక్తిని నిందితుడిగా పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో (Saif Ali Khan’s attacker) ఉన్నాడు. దాడికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. విచారణలో భాగంగా మంగళవారం పోలీసులు క్రేౖమ్‌ సీన్‌ రీక్రియేట్‌ చేసినట్లు తెలిసింది. బాంద్రాలోని సైఫ్‌ ఇంటికి నిందితుడిని తీసుకువెళ్లి.. దాడి ఎలా చేశాడనే విషయాలు తెలుసుకున్నారు. ‘‘అర్థరాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులు నిద్రిస్తున్నట్లు తెలుసుకున్న నిందితుడు.. బిల్డింగ్‌ ప్రహరీ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం వెనుక మెట్లు ఎక్కి ఎయిర్‌ కండీషనింగ్‌ డక్ట్‌ సాయంతో సైఫ్‌ ఇంట్లోకి వచ్చాడు. చప్పుడు కాకుండా ఉండేందుకు చెప్పులు తీసేసి బ్యాగ్‌లో దాడి సెల్‌ఫోన్‌ స్విచ్ఫాఫ్‌ చేసుకున్నాడు’’ అని పోలీసు అధికారులు చెప్పినట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. దాడి తర్వాత సైఫ్‌ తనని బాత్రూమ్‌లో బంధించాడని.. ఎయిర్‌ కండీషనింగ్‌ డక్ట్‌ సాయంతో ఆ గది నుంచి బయటపడ్డానని అతడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దాడి తర్వాత పోలీసులు గాలిస్తున్నారని గ్రహించిన అతడు కోల్‌కత్తాలోని హౌరా నుంచి బంగ్లాదేశ్‌ పారిపోవాలని భావించాడు. ఈ క్రమంలో పలువురు ట్రావెల్‌ ఏజెంట్లను కలిసి హావ్‌డా ట్రైన్‌ టికెట్‌ కోసం ప్రయత్నించాడు. వారు ఎక్కువ డబ్బు చి?మాండ్‌ చేయడంతో అతడు వెంటనే చెల్లించలేకపోయాడు. నిందితుడు ఉపయోగించిన సిమ్‌ కార్డు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఖుకుమోని జహంగీర్‌ సెఖా అనే వ్యక్తి పేరుపై ఉంది. నిందితుడు తన పేరుమీదే ఆధార్‌ కార్డు పొందేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. మంగళవారం సైఫ్‌అలీఖాన్‌ ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు.

Updated Date - Jan 22 , 2025 | 04:59 PM