Huma Qureshi: ఎప్పటికి ఈ పద్దతి మారదు.
ABN , Publish Date - Jan 25 , 2025 | 09:30 AM
"సమాజంలో ఎన్ని మార్పులు వచ్చిన సినిమాల్లో ఈ తీరు మాత్రం మారదు. ఇంకా ఎన్నేళ్లు అయినా ఇదే పద్ధతి కొనసాగుతుంది" అని హుమా ఖురేషి అన్నారు.
"సినిమాల్లో హీరోయిన్ల పత్రాలపై బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి (Huma Qureshi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న పెద్ద సినిమా ఏదైనా కథానాయికలకు రెండు పాటలు, నాలుగు సన్నివేశాలు ఇంతే ఉంటాయి. అయినా సరే, వారేమీ అభ్యంతరం చెప్పడానికి లేదు. మంచి అవకాశం అనుకుంటే చేసేస్తారు. కానీ స్త్రీ ప్రాధాన్యత చిత్రాల్లో మాత్రం హీరోలు (Star Heros) తక్కువ నిడివి ఉంటే చేయడానికి మాత్రం ఒప్పుకోరు. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చిన సినిమాల్లో ఈ తీరు మాత్రం మారదు. ఇంకా ఎన్నేళ్లు అయినా ఇదే పద్ధతి కొనసాగుతుంది" అని ఆమె అన్నారు. హైదరాబాద్ సాహితీ మహోత్సవంలో హుమా ఖురేషీ రచించిన ‘జబా - ఆన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో’ పుస్తకం మీద చర్చాగోష్ఠి జరిగింది. (Huma Qureshi Comments on Heros)
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "స్త్రీ ప్రాధాన్యత పాత్రలు మరిన్ని రావాలని మనం మాత్రమే కోరుకుంటే కాదు, దర్శక, నిర్మాతలు కూడా బలంగా కోరుకోవాలని అన్నారు. అదే సమయంలో రచయితలు కూడా అలాంటి పాత్రలను సృష్టించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం హిందీలో ఆమె చేతిలో 5 సినిమాలు ఉన్నాయి.
ఇదే వేదికపై బాలీవుడ్ నటుడు అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే దంపతులతో ‘వ్యూ ఫైండర్’ అంశంపై సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ (director Indraganti Mohan Krishna) సమన్వయంలో చర్చా గోష్ఠి జరిగింది.