War 2: వార్‌ 2 ఎపిక్‌ డ్యాన్స్‌ సీక్వెన్స్‌తో పూర్తి..

ABN , Publish Date - Mar 04 , 2025 | 04:16 PM

తాజాగా హృతిక్‌ రోషన్‌, తారక్‌లపై ఎపిక్‌ డ్యాన్స్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ చేస్తున్నారు. ఇది ముంబై యశ్‌రాజ్‌ స్టూడియోస్‌లో జరుగుతోంది. 500 మందికి పైగా డ్యాన్సర్లతో ఆరు రోజులపాటు భారీ స్థాయిలో ఈ సాంగ్‌ను  చిత్రీకరిస్తున్నారని తెలిసింది.


బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం వార్‌ -2. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా హృతిక్‌ రోషన్‌, తారక్‌లపై ఎపిక్‌ డ్యాన్స్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ చేస్తున్నారు. ఇది ముంబై యశ్‌రాజ్‌ స్టూడియోస్‌లో జరుగుతోంది. 500 మందికి పైగా డ్యాన్సర్లతో ఆరు రోజులపాటు భారీ స్థాయిలో ఈ సాంగ్‌ను  చిత్రీకరిస్తున్నారని తెలిసింది. బాస్కో (Basco)మార్టీస్‌ కొరియోగ్రాఫీ అందిస్తుండగా ప్రీతమ్‌ ఈ పాటకు  సంగీతాన్ని అందించారు. ఈ పాటతో సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది. ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో నాటు నాటు తరహాలో ఈ పాటు ఫ్యాన్స్‌ అలరించబోతోందని యూనిట్‌ చెబుతోంది. తదుపరి చిత్ర బృందం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో నిమగ్నం కానుంది. 2019లో యశ్‌రాజ్‌ సంస్థ నిర్మించిన వార్‌ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. ఆగస్ట్‌ 14న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.



ఇదిలా ఉంటే తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో డ్రాగన్‌ (వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో 3000 మంది ఆర్టిస్ట్‌లతో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇస్తారని టాక్‌. ఈ చిత్రం గురించి నిర్మాత యలమంచిలి రవిశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కలెక్షన్లులకు స్కై ఈజ్‌ ద లిమిట్‌ అని, ఎంతగా అయినా అంచనాలు పెట్టుకోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేయడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.



Updated Date - Mar 04 , 2025 | 05:13 PM