Saif Ali Khan: కమ్యూనిటీ దొంగేనా.. ఆ సమయంలో కరీనా ఎక్కడుంది
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:31 PM
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తి దాడికి గురైన సంగతి తెలిసిందే. ఆ చేసిన వ్యక్తి ఎవరనేది ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసుల దర్యాప్తులో భాగంగా ముంబైలోని ఆ ఇంటి సీసీ టీవీ ఫుటేజ్‌ను తనిఖీ చేశారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కత్తి దాడికి గురైన సంగతి తెలిసిందే. ఆ చేసిన వ్యక్తి ఎవరనేది ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసుల దర్యాప్తులో భాగంగా ముంబైలోని ఆ ఇంటి సీసీ టీవీ ఫుటేజ్‌ను తనిఖీ చేశారు. సైఫ్‌పై దుండగుడు తెల్లవారుజామున 2.30 సమయంలో కత్తితో దాడి చేశాడు. అంతకుముందు రెండు గంటల లోపల ఎవరూ ఆ సొసైటీలోకి వెళ్లలేదని పోలీసులు గుర్తించారు. నటుడు 9Saif ali khan attacked) ఉంటున్న సొసైటీలో ఆ దుండగుడు ముందే ఉన్నట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ఈ దాడిలో సైఫ్ ఇంట్లో పనిచేేస మహిళా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సైఫ్‌పై దాడి జరిగినట్లు తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సీనియర్ అధికారుల బృందం అక్కడికి చేరుకొంది. గాయపడిన నటుడిని లీలావతి ఆస్పత్రికి తరలించినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. ప్రస్తుతం ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి, అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నారు. అలీఖాన్ సొసైటీలోని సిబ్బందిలోనే దుండగుడు ఉండొచ్చని బలంగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే సైఫ్‌కు చెందిన ఐదుగురు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఆ సొసైటీ గార్డ్ కూడా ఎవరినీ చూడలేదని చెబుతున్నారు. దొంగతనం కోసమే ఈ దాడి జరిగిందా అన్న ప్రశ్నకు పోలీసులు స్పందిస్తూ.. దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. నిందితుడు సైఫ్ కుమారుడు జేహ్ గదిలో నక్కినట్లు స్థానిక పత్రిక లోక్‌మత్ కథనంలో పేర్కొంది. దీంతో జేహ్ కేర్‌టేకర్ అతడిని చూసి కేకలు వేసినట్లు పేర్కొంది. దీంతో హడావుడిగా సైఫ్ అక్కడికి చేరుకోగా పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో సైఫ్ గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో కరీనా, తైమూర్ కూడా ఇంట్లోనే ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు ధ్రువీకరించారు. ఆరు చోట్ల కత్తి గాయాలు కాగా.. వీటిలో వెన్నెముక పక్కన, మరొక చోట లోతైన గాయాలు అయ్యాయని పోలీసులు చెబుతున్నారు.
ఆ సమయంలో కరీనా ఎక్కడుంది..
సైఫ్‌పై జరిగిన దాడి సమయంలో కరీనా ఎక్కుడున్నారని అందరూ ఆరా తీస్తున్నారు. పోలీసులు మాత్రం కరీనా, తన బిడ్డ తైమూర్ ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారని పేర్కొనగా, ఆ సమయంలో కరీనా ఇంట్లో లేదని, తన సోదరి కరీష్మా కపూర్, సోనమ్ కపూర్, రియా కపూర్‌లతో డిన్నర్ డేట్‌కి వెళ్లిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆస్పత్రికి షారుక్..:
సైఫ్‌పై జరిగిన దాడి గురించి తెలుసుకుని సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని పలకరించేందుకు పలువురు తారలు లీలావతి ఆస్పత్రికి వెళ్తున్నారు. నటుడు షారుక్ ఆస్పత్రికి బయలుదేరిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. సైఫ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇప్పటికే ఆస్పత్రికి చేరుకుని నటుడి యోగక్షేమాలు చూసుకుంటున్నారు.