Genelia: పదేళ్ల తర్వాత.. జెనీలియా రీఎంట్రీ అదిరింది..

ABN , Publish Date - Mar 30 , 2025 | 03:04 PM

  హాసిని పేరు తలచుకోగానే గుర్తొచ్చే హీరోయిన్‌ జెనీలియా(Genelia). 'బొమ్మరిల్లు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆ తర్వాత కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు.

 
హాసిని పేరు తలచుకోగానే గుర్తొచ్చే హీరోయిన్‌ జెనీలియా(Genelia). 'బొమ్మరిల్లు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆ తర్వాత కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు. పెళ్లి తర్వాత అటు బాలీవుడ్‌(Bollywood), ఇటు టాలీవుడ్‌లోనూ ఆమె సినిమాలకు బై చెప్పారు. సుమారు 10 ఏళ్ల విరామం తర్వాత ‘వేద్‌’లో యాక్ట్‌ చేసి విజయాన్ని అందుకున్నారు. ‘మజిలీ’ చిత్రానికి మఠారీ రీమేక్‌గా వచ్చిన చిత్రమిది.  తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఇన్నేళ్ల పాటు విరామం తీసుకోవడానికి గల కారణాన్ని చెప్పారు. మళ్లీ సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు తెలిసిన వాళ్లు ఎవరూ ప్రోత్సహించలేదన్నారు.  
 

‘‘కెరీర్‌ పరంగా సక్సెస్‌ లేదా ఫెయిల్యూర్‌కు నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వను. జయాపజయాలు మన జీవితంలో భాగమే. కాబ్టటి, వాటి కంటే కూడా, మనం ఎలా జీవితాన్ని కొనసాగిస్తున్నామనేది ముఖ్యంగా భావిస్తా.. ఒక నటిగా దాదాపు ఆరు భాషల్లో యాక్ట్‌ చేశా. పిల్లలు పుట్టిన తర్వాత యాక్టింగ్‌కు దూరం కావాలనిపించింది. ఇటీవల తిరిగి కమ్‌ బ్యాక్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు తెలిసిన వాళ్లెవరూ ప్రోత్సహించలేదు. ‘పదేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తున్నావా? ఇది ఏమాత్రం వర్కౌట్‌ కాదు’ అని నిరాశ పరిచారు. ధైౖర్యం చేసి సినిమాల్లోకి తిరిగి వచ్చా. రితేశ్‌తో కలిసి నటించిన ‘వేద్‌’ మంచి విజయాన్ని అందుకుంది. కాబట్టి అన్ని విషయాల్లో ఇతరులను నమ్మడానికి లేదు’’ అని జెనీలియా అన్నారు. ఈ పదేళ్ల కాలంలో తన గురించి, పిల్లలు, కుటుంబం గురించి మాత్రమే తాను ఎక్కువగా దృష్టి పెట్టానని వివరించారు.

Updated Date - Mar 30 , 2025 | 03:28 PM