Ameesha vs Anil: గదర్ 2 దర్శకుడిపై అమీషా పటేల్ ఫైర్
ABN , Publish Date - Feb 14 , 2025 | 03:36 PM
‘గదర్ 2’ (Gadar 2)సినిమా విషయంలో దర్శకుడు అనిల్ శర్మ (Anil Sharma), నటి నటి అమీాషా పటేల్ (Ameesha Patel) మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనిల్‌శర్మ తీరును తప్పుపడుతూ సినిమా స్టోరీ నెరేషన్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను ఆమె ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
‘గదర్ 2’ (Gadar 2)సినిమా విషయంలో దర్శకుడు అనిల్ శర్మ (Anil Sharma), నటి నటి అమీాషా పటేల్ (Ameesha Patel) మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనిల్‌శర్మ తీరును తప్పుపడుతూ సినిమా స్టోరీ నెరేషన్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను ఆమె ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ‘‘గదర్ 2’ నెరేషన్‌కు సంబంధించిన వీడియోలివి. సినిమా పతాక సన్నివేశాల్లో విలన్‌ను సకీనానే (అమీషా నటించిన క్యారెక్టర్) చంపుతుందని ఆయన నాతో చెప్పారు. ఇప్పుడు మాత్రం ఆయన తాను ఆ విధంగా చెప్పలేదని అంటున్నారు. అలా ఎలా చెబుతారు? ఇప్పుడు మీరెలా దీనిని అంగీకరించడం లేదు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘గదర్ ఏక్ ప్రేమ్‌కథ’కు సీక్వెల్‌గా ‘గదర్ 2’ తెరకెక్కింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. సన్నీదేవోల్(Sunny deol), అమీషా పటేల్ ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. (Ameesha VS Anil Sharma)
తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా దర్శకుడు సినిమా క్లైమాక్స్ మార్చేశారని ఓ ఇంటర్వ్యూలో అమీషా పటేల్ అన్నారు. ‘‘ప్రతి నాయకుడు పాత్రను సకీనానే చంపాలని తొలుత ఆయన రాసుకున్నారు. అది నాకెంతో నచ్చింది. కానీ షూట్‌కు వచ్చేసరికి అనిల్ సీన్ మార్చేశారు. ప్రతినాయకుడి పాత్రను చరణ్‌జీత్ చంపేలా క్రియేట్ చేశారు. షూట్ జరిగేవరకూ ఆ విషయం నాక్కూడా తెలియదు’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
దీనిపై స్పందించిన అనిల్ శర్మ.. అమీషా మాటల్లో నిజం లేదన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘గదర్ 2’ గురించి మేము మాట్లాడుకున్నప్పుడు సకీనా కూడా పాకిస్థాన్ వెళ్తుంది కదా అని ఆమె నన్ను అడిగింది. అలాంటిది ఏమీ లేదని.. నాకు అలాంటి ఉద్దేశం లేదని తేల్చి చెప్పేశాను. తారాసింగ్ (సన్నీదేవోల్ పాత్ర) తనతోపాటు అందరినీ తీసుకువెళ్లడానికి పాకిస్థాన్ ఏమైనా పర్యటక ప్రాంతమా? తన కుమారుడు చరణ్‌జీత్ కిడ్నాప్ అయినప్పుడు.. అతడిని విడిపించడానికి తారాసింగ్ భార్యను వెంటపెట్టుకొని వెళ్తాడా?’’ అని ప్రశ్నించారు.