Bollywood: ఫస్ట్ ఓకే... సెకండ్ నాట్ ఓకే!
ABN , Publish Date - Mar 10 , 2025 | 09:03 PM
బాలీవుడ్ లో ప్రస్తుతం ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. బోనీ, శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకి సక్సెస్ లభించింది. ఆమె చెల్లి పరాజయం పాలైంది. సైఫ్ అలీఖాన్ పెద్ద కూతురు సారా చక్కని విజయాలను అందుకుంది. కానీ ఆమె తమ్ముడు ఇబ్రహీం మాత్రం ఫ్లాప్ ను మూటకట్టుకున్నాడు.
ఏ ఇండస్ట్రీలోనైనా సినీ వారసత్వం కొత్తేమి కాదు. అన్ని సినీ పరిశ్రమలోనూ హీరోలు, హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్.. ఇలా అందరూ తమ వారసులని సినిమాల్లోకి తీసుకొస్తారు. బాలీవుడ్ లో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. నెపోటిజం పెరిగి పోతుందని కామెంట్స్ వినిపిస్తున్నా.... వారసుల ఎంట్రీ కోసం పక్కా ప్లానింగ్ తో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ స్టార్స్ తమ కొడుకులని, కూతుర్లని హీరో హీరోయిన్స్ గా తీసుకొచ్చారు. అయితే ఇక్కడే ఓ విచిత్రమైన సంఘటన ఎదురవుతోంది.
ప్రజెంట్ బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ హవా నడుస్తోంది. అయితే... ఫస్ట్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన వారు దుమ్మురేపుతుంటే... వారి తర్వాత ఎంట్రీ ఇస్తున్న సెకండ్ కిడ్స్ హిట్ల కోసం తెగ కష్టపడుతున్నారు. బోనీ కపూర్ (Boney Kapoor), శ్రీదేవి (Sridevi) ముద్దుల డాటర్లు ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. బోనీ పెద్ద కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సినీ ఎంట్రీ ఇచ్చి... సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. బాలీవుడ్, టాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో పాటు హిట్లను ఖాతాలో వేసుకుంటోంది. కానీ జాన్వీ చెల్లి ఖుషీ కపూర్ (Khushi Kapoor) కు మాత్రం హిట్లు పడటం లేదు. ఇప్పటికే మూడు సినిమాలు చేసిన వావ్ అనే హిట్ ను మాత్రం అందుకోలేకపోయింది. ఓ వైపు అక్క సిల్వర్ స్క్రీన్ ను అల్లాడిస్తుంటే... చెల్లి మాత్రం తడబాటుకు గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సేమ్ ఇలాంటి పరిస్థితే మరో స్టార్ కిడ్ కు ఎదురవ్వడం సెన్సేషన్ గా మారింది.
Also Read: Pawan Kalyan: చిరంజీవి మూవీ ప్లేస్ లో పవన్ సినిమా
వారసుల ఎంట్రీకై సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) తెగ కష్టపడ్డాడు. పక్కా స్కెచ్ తో వారసులను వెండితెరకు పరిచయం చేశాడు. కట్ చేస్తే... మొదట బిగ్ స్క్రీన్ పైకి వచ్చిన సారా అలీఖాన్ (Sara Ali Khan)... హిట్ల జోరు చూపిస్తుంటే.... కొడుకు ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan) మాత్రం అక్క స్పీడ్ ను అందుకోలేకపోతున్నాడు. రీసెంట్ గా ఖుషీ కపూర్ , ఇబ్రహీం నటించిన 'నాదానియన్' ఓటీటీలోకి వచ్చేసింది. కానీ ఈ మూవీ మెప్పించలేకపోయింది. అయితే మొదట సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన జాన్వీ, సారా సక్సెస్ రేట్ లో దూసుకుపోతుంటే.. తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఖుషీ, ఇబ్రహీం మాత్రం ఫ్లాపులను మూట కట్టుకుంటున్నారు. అయితే త్వరలో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) వారసులు సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఒకరు నటనలో అయితే మరొకరు డైరెక్షన్ వైపు అడుగులు వేస్తున్నారు. మరీ ఇద్దరి లక్ ఎలాఉంటుందో చూడాలి మరి.
Also Read: Bollywood: కోర్టు బోనెక్కబోతున్న బాలీవుడ్ స్టార్స్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి