Emraan Hashmi: ఆవారాపన్ -2 ఆగమనం ఎప్పుడంటే...

ABN , Publish Date - Mar 24 , 2025 | 04:45 PM

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటించిన 'ఆవారాపన్' మూవీ 2007లో విడుదలైంది. ఇంతకాలానికి ఇప్పుడా మూవీకి సీక్వెల్ తెరకెక్కబోతోంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. అయితే... ఈ రెండు సినిమాల విడుదల... అనివార్య కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' కాగా మరొకటి అడివి శేష్‌ 'జి2'. ఈ రెండు సినిమాలతో పాటు కొన్ని హిందీ చిత్రాల్లోనూ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. మార్చి 24 అతని పుట్టిన రోజు. ఆ సందర్భంగా ఇమ్రాన్ హష్మీ 2007లో వచ్చిన తన సక్సెస్ ఫుల్ మూవీ 'ఆవారాపన్'కు సీక్వెల్ చేయబోతున్నట్టు ప్రకటించాడు.


నిజానికి కొద్దిరోజుల క్రితం 'ఆవారాపన్' సీక్వెల్ ఉండబోతోందని సోషల్ మీడియా ద్వారా ఇమ్రాన్ హింట్ ఇచ్చాడు. ఇక సోమవారం ఆ మూవీ రిలీజ్ డేట్ నూ ఇమ్రాన్ హష్మీ ప్రకటించాడు. అప్పట్లో 'ఆవారాపన్' మూవీని మోహిత్ సూరి దర్శకత్వంలో ముఖేశ్‌ భట్ నిర్మించారు. ఇప్పుడీ సీక్వెల్ ను నితిన్ కక్కర్ దర్శకత్వంలో విశేష్‌ భట్ నిర్మించబోతున్నాడు. తాజాగా విడుదల చేసిన 'ఆవారాపన్ -2' టీజర్ లో మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు.

Also Read: Mass Maharaja: మరోసారి రవితేజ స్వీట్ మెమొరీస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 24 , 2025 | 05:07 PM