Dia Mirza: ఖరీదైన దుస్తులు వేసుకున్నా.. తిన్నది మాత్రం..

ABN , Publish Date - Mar 12 , 2025 | 02:45 PM

కెరీర్‌ బిగినింగ్‌లో సవాళ్లు ఎదుర్కోవడం ఎలాంటి ఆర్టిస్ట్‌కైనా సహజమే. ఇప్పుడు ఎంత పెద్ద స్టార్‌ అయినా కావచ్చు కెరీర్‌ బిగినింగ్‌లో ఇబ్బందులు సహజంగానే ఉంటాయి.

కెరీర్‌ బిగినింగ్‌లో సవాళ్లు ఎదుర్కోవడం ఎలాంటి ఆర్టిస్ట్‌కైనా సహజమే. ఇప్పుడు ఎంత పెద్ద స్టార్‌ అయినా కావచ్చు కెరీర్‌ బిగినింగ్‌లో ఇబ్బందులు సహజంగానే ఉంటాయి. మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు చెప్పారు నటి దియా మీర్జా (Dia Mirza). ఆ సమయంలో చేతిలో డబ్బుల్లేక ఇబ్బందిపడ్డానని ఆమె అన్నారు. (Bollywood Actress Dia Mirza)


Dia.jpg‘2000లో నేను, ప్రియాంకా చోప్రా(Priyanka Chopra), లారా దత్తా.. మిస్‌ ఇండియా (miss india) పోటీల్లో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రియాంకకు కుటుంబ సభ్యుల నుంచి ఎంతో సపోర్ట్‌ ఉండేది. మాకు సపోర్ట్‌ చేయడానికి ఎవరూ ఉండేవారు కాదు. మోడలింగ్‌లో రాణిస్తోన్న కారణంగా అప్పటికే లారా ముంబయిలో ఒక ఇరికింట్లో అద్దెకు ఉండేది. నేను ముంబయి వచ్చినప్పుడు.. ఆమె నాకెంతో సాయంగా నిలిచింది. తన రూమ్‌లో ఉండేందుకు అవకాశం కల్పించింది. చిన్న ఇల్లే అయినప్పటికీ మేమిద్దరం సర్దుకుపోయాం. ఫ్యాషన్‌ షోల్లో పాల్గొని.. ఖరీదైన దుస్తులు ధరించి నప్పటికీ ఒక్కోసారి చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు. చాలీచాలని డబ్బుతోనే జీవితాన్ని కొనసాగించాం. కొన్నిసార్లు నూడుల్స్‌ తిని కడుపు నింపుకున్నాం. అలా చాలా రోజులు గడిపాం. మా పరిస్థితిని తలుచుకొని నవ్వుకునేవాళ్లం. ఖరీదైన దుస్తులు వేసుకున్నా.. తినేది మాత్రం నూడుల్స్‌ అనుకునేవాళ్లం’’ అని దియామీర్జా ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. 2000 మిస్‌ ఇండియా పోటీల్లో లారా దత్తా విజేతగా కిరీటాన్ని అందుకోగా.. ఫస్ట్‌ రన్నరప్‌గా ప్రియాంకా చోప్రా, సెకండ్‌ రన్నరప్‌గా దియా మీర్జా నిలిచారు. 2001లో విడుదలైన ‘రెహ్నా హై తేరే దిల్‌ మే’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు దియా మీర్జా. అనంతరం ఆమె బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేశారు. 2021లో విడుదలైన ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమాలో ఆమె నటించారు.  

Sreeleela: కార్తిక్‌తో శ్రీలీల డేటింగ్‌.. తల్లి ఏమన్నారంటే..

Raasii khanna: యేడాది చివరిలో కెమెరా ముందుకు దొంగనోట్ల ముఠా

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2025 | 03:24 PM