Kiss Scene: ఆ ముద్దు సీన్ ట్రిమ్ చేశారు.. పాపం పూజా హెగ్డే?

ABN , Publish Date - Jan 30 , 2025 | 02:25 PM

పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం ఏమంత బాగా లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటిన పూజాకు హిట్ పడి చాలా కాలం అవుతుంది. హిట్ సంగతి అటుంచితే.. అవకాశాలు కూడా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఆమె గ్లామర్ ఎర వేస్తూ.. అవకాశాలు పట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో ఆమె తన తాజా చిత్రంలో కాస్త హద్దు దాటి కిస్ సీన్లు చేసినా.. వాటిని సెన్సార్ ట్రిమ్ చేసినట్లుగా తెలుస్తుంది. విషయంలోకి వస్తే..

Heroine Pooja Hegde

ఒకప్పుడు సినిమాలలో లిప్ లాక్, కిస్ సీన్లు చాలా అరుదుగా కనిపించేవి. ప్రస్తుతం మాత్రం అవి లేకుండా సినిమాలే బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రేక్షకులను మరీ ముఖ్యంగా యూత్ ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడానికి, థియేటర్లకు రాబట్టుకోవడానికి.. మేకర్స్ హీరోహీరోయిన్ల మధ్య కిస్ సీన్లు, హీరోయిన్లతో ఎక్స్‌పోజింగ్ సీన్లు తప్పనిసరి చేశారు. సెన్సార్ కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో.. ఈ సీన్లు యాజీటీజ్‌గా తెరపై పడుతున్నాయి. ఆడియెన్స్ కూడా ఈ సీన్లను ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే మేం రాసుకుంటున్నాం, తెరకెక్కిస్తున్నామని ప్రస్తుత మేకర్స్ ఈ సీన్లకు వివరణ ఇచ్చుకుంటున్నారు. ఈ మధ్య వచ్చిన ‘యానిమల్’ సినిమా విషయంలో ఫ్యామిలీ ఆడియెన్స్ మండిపడినా.. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో.. నేటి యువత ఇవే కోరుకుంటున్నారనేది స్పష్టమైందని మేకర్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అదంతా సరే.. అసలీ టాపిక్ ఇప్పుడెందుకూ అంటే.. తాజాగా ఓ మూవీలో ఉన్న గాఢమైన లిప్‌లాక్ సీన్‌ని ట్రిమ్ చేస్తేనే, సినిమాకు యు బై ఏ సర్టిఫికేట్ ఇస్తామని సెన్సార్ వారు చెప్పడంతో.. చేసేది లేక సదరు దర్శకనిర్మాతలు ఆ సన్నివేశాన్ని ట్రిమ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటని అనుకుంటున్నారా? ఆ వివరాల్లోకి వెళితే..


deva.jpg

Also Read- Aditi Shankar: నాన్న పెట్టిన నిబంధన మేరకే సినిమాలు చేస్తున్నా..

ఆ సినిమా మరేదో కాదు.. షాహిద్ కపూర్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవా’. ఈ సినిమా జనవరి 31న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఇప్పటి వరకు అంతగా ఎక్కడా వార్తలలో లేని ఈ సినిమా ఈ కిస్ సన్నివేశం ట్రిమ్ చేసిన విషయంతో వార్తలలో హైలెట్ అవుతోంది. ఒకరకంగా ఇది సినిమాకు మంచే చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, బాలీవుడ్‌లో సినిమాల పరిస్థితి ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది. సౌత్ సినిమాలను అక్కడి ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. రీసెంట్‌గా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం.. కేవలం నార్త్ బెల్ట్‌లోనే దాదాపు రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిందంటే, సౌత్‌ సినిమాలకు నార్త్ ఆడియెన్స్ ఎలా కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో.. వారి సినిమాలపై ఆసక్తి పెంచడానికి బాలీవుడ్ మేకర్స్ తీవ్రంగా కృషి చేయాల్సి వస్తుంది. ‘దేవా’లోని డీప్ కిస్ సన్నివేశాన్ని ట్రిమ్ చేయాలని సెన్సార్ ఆదేశాలతో.. సినిమాకు మంచి పబ్లిసిటీ లభిస్తోంది. సెన్సార్ ఆదేశాల మేరకు 6 సెకన్ల పాటు ఈ ముద్దు సన్నివేశాన్ని ట్రిమ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు వారి సూచించిన మరో రెండు కట్స్ కూడా మేకర్స్ చేయబట్టే.. సినిమాకు యు బై ఏ సర్టిఫికేట్ జారీ చేశారని బాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.


Allu-Arjun.jpg

Also Read- Chandini Tamilarasan: ‘నో’ చెబితే టచ్‌ చేసే సాహసం చేయరు

ఆ కిస్ సీన్‌ని ట్రిమ్ చేయాల్సిన అవసరమేంటి?

ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలలో.. అవసరం ఉన్నా లేకున్నా ముద్దు సీన్లను ఇరికించేస్తున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ముద్దుని ఎరగా వాడుతున్న మేకర్స్.. ప్రమోషన్స్‌లో ఆ వివరాలను రివీల్ చేస్తూ.. సినిమాపై హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలలో ఈ ముద్దు సీన్లను ఎవరూ పట్టించుకోరు కానీ.. బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో ఈ ముద్దు సీన్లు కొన్ని సినిమాలకు క్రేజ్ తీసుకు వస్తే.. మరికొన్ని కాంట్రవర్సీలకు దారి తీస్తున్నాయి. ఇప్పుడీ సినిమాలో కిస్ సీన్ ట్రిమ్ చేశారనే వార్త బయటికి వచ్చినప్పటి నుండి ఓ వర్గం ప్రేక్షకులు.. ఎందుకు ట్రిమ్ చేశారు? ఇంతకు ముందు వచ్చిన సినిమాలలో కిస్ సీన్స్ లేవా? అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.

Pooja-1.jpg

అసలు బాలీవుడ్ అంటేనే కిస్ సీన్లకు పెట్టింది పేరు. ఇమ్రాన్ హష్మీ ప్రతి సినిమాలో లిప్ లాక్‌లుంటాయి. ఆయనకి సీరియల్ కిస్సర్ అనే బిరుదు కూడా ఉంది. ఆయనొక్కరే కాదు.. ఇప్పుడొస్తున్న బాలీవుడ్ సినిమాలన్నింటిలో హీరోహీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్స్ కామన్ అయిపోయాయి. మరి ప్రత్యేకంగా ఈ సినిమాకే ఎందుకు ట్రిమ్ చేయమని సెన్సార్ వారు ఆదేశాలు జారీ చేశారంటే.. అంత గాఢంగా, ఎక్కువ నిడివితో ఆ సీన్‌ని దర్శకుడు చిత్రీకరించారట. అందుకే పూర్తిగా ఆ సీన్ తీసేయమని చెప్పకుండా ట్రిమ్ చేయమని సెన్సార్ టీమ్ చెప్పినట్లుగా సమాచారం. ఈ సినిమా అనే కాదు, ఇంతకు ముందు షాహిద్ కపూర్ చేసిన సినిమా విషయంలోనూ సెన్సార్ వారు ఇలాంటి నిబంధనలే విధించడం గమనార్హం.


Pooja-Hegde-varun.jpg

Also Read- Pushpa 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘పుష్ప 2 రీ లోడెడ్’.. నీ యవ్వ ఇక తగ్గేదే లే..

ప్రతి హీరోకి పూజా హెగ్డే కిస్..

ఇదిలా ఉంటే, ‘దేవా’లో షాహిద్ కపూర్‌కే కాదు.. పూజా హెగ్డే మొదటి నుండి అంటే, హృతిక్ రోషన్‌తో చేసిన ‘మొహంజదారో’ సినిమా అప్పటి నుండి టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఆయా ఇండస్ట్రీలలోని, తను చేస్తున్న సినిమాలలోని ప్రతి హీరోకూ కిస్ ఇస్తూనే ఉంది. టాలీవుడ్‌లో ‘ఒక లైలా కోసం’ సినిమాతో మొదలైన పూజా హెగ్డే.. ఆ సినిమా హీరో నాగ చైతన్యకు మొదలుకుని ఆ తర్వాత తను చేసిన సినిమాలలోని హీరోలందరికీ ముద్దు ఇస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ‘డిజె’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఇలా ఆ వుడ్, ఈ వుడ్ అనే తేడా లేకుండా.. ప్రతి హీరోకూ తన అధరామృతాన్ని పంచుతూనే ఉంది.

akhil.jpg

ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్త డౌన్ నడుస్తుండటంతో.. గ్లామర్ డోస్ ఇంకాస్త పెంచడానికి కూడా సిద్ధం అన్నట్లుగా మేకర్స్‌కి హింట్ ఇస్తుందనేలా ఈ మధ్య టాక్ వినిపించింది. అందుకే ‘దేవా’లో షాహిద్‌తో ఎక్కువ నిడివిగల ముద్దు సీన్‌కి ఓకే చెప్పిందని అంటున్నారు. అయినా ఏం లాభం? ఆమె ఆశలకు సెన్సార్ బ్రేక్ వేసిందిగా! అని అనే వారూ లేకపోలేదు. మరి ఈ సినిమా పూజా కెరీర్‌కి ఎలా ఉపయోగపడుతుందో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ‘దేవా’ చిత్రాన్ని జీ స్టూడియోస్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించారు.


Also Read- Raghava Lawrence Kanchana 4: ‘కాంచన 4’.. కత్తిలాంటి ఫిగర్‌ని పట్టిన లారెన్స్

Also Read- Rakhi Sawant Marriage: మూడో పెళ్లికి ఫైర్ బ్రాండ్ రెడీ.. టార్గెట్ పాకిస్తాన్!

Also Read- Fatima Sana Shaikh: ఓ తెలుగు నిర్మాత పచ్చిగా అడిగాడు.. ‘దంగల్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 04:16 PM