Deepika Padukone: ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్నా..

ABN , Publish Date - Mar 20 , 2025 | 02:12 PM

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె లాస్టియర్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఏడాదిగా ఆమె తన బిడ్డ కోసమే సమయం కేటాయిస్తుంది. చిన్నారితో సరదాగా గడుపుతోంది


బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) లాస్టియర్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఏడాదిగా ఆమె తన బిడ్డ కోసమే సమయం కేటాయిస్తుంది. చిన్నారితో సరదాగా గడుపుతోంది. ఇప్పుడు బ్యాక్‌ టు వర్క్‌ అంటూ షూటింగ్స్‌తో బిజీ కానుంది. ఈనేపథ్యంలో తల్లిగా తన కుమార్తెతో సమయం గడపడం, చిత్రీకరణలో పాల్గొనడం గురించి బాలీవుడ్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.  (bollywood Actress)

‘‘ఒక అమ్మగా షూటింగ్‌కు వెళ్లడం సవాల్‌తో కూడిన పనే. ప్రస్తుతం నేను నా జీవితంలో మాతృత్వపు మాధుర్యాన్ని (Motherhood and experiencing) ఎంతగానో ఆస్వాదిస్తున్నా. ఇకపై షూటింగ్‌లతో బిజీ కావడానికి సిద్థమవ్వాలి. నా కుమార్తెకు తల్లిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తూనే సినిమా షూటింగ్స్‌కు వెళ్లాలి. ఈ విషయంలో సలహాలు ఇచ్చేందుకు ఎంతోమంది మహిళలు ఉన్నారని నాకు తెలుసు. కానీ, ఇది నాకు అతిపెద్ద సవాల్‌గా కనిపిస్తోంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలో అని ఆలోచిస్తున్నా. కచ్చితంగా దీన్ని అధిగమించగలననే నమ్మకం ఉంది. మాతృత్వం అనేది గొప్ప అనుభూతి. ఇది నేను ఎంచుకునే సినిమాలపై ప్రభావం చూపుతుందని నాకు తెలుసు. నేను తల్లి కాకముందు కూడా సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నాను. ఇకపై కూడా అలానే తీసుకుంటాను. ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాను’’ అని దీపికా చెప్పారు. గతేడాది ‘కల్కి 2898 ఏడీ’లో సుమతి పాత్రలో కనిపించి అలరించారు దీపికా. ప్రస్తుతం దీని సీక్వెల్‌ పనులతో బిజీ కానున్నారు. 

Updated Date - Mar 20 , 2025 | 02:12 PM