Deepika Padukone: RRRతో సంబంధం లేకపోయినా.. మన సినిమా అనే గర్వం
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:18 PM
మన దేశంలో ఎంతోమంది ప్రతిభ ఉన్న నటీనటులున్నారనీ, అయితే చాలాసార్లు మనకు రావలసిన అవార్డులను లాగేసుకున్నారని దీపికా పదుకొణె కామెంట్స్ చేశారు.
మన దేశంలో ఎంతోమంది ప్రతిభ ఉన్న నటీనటులున్నారనీ, అయితే చాలాసార్లు మనకు రావలసిన అవార్డులను లాగేసుకున్నారని దీపికా పదుకొణె (Deepika Padukone) కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఆస్కార్ (Deepika Comments on Oscar) గురించి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నారు.
"భారతదేశం సినీ చరిత్రలో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి. కానీ ఆ సినిమాలకు, ఆ కథలకు, నటీనటుల ప్రతిభకు ఏమాత్రం గుర్తింపు రాలేదు. ‘చాలాసార్లు మనకు రావాల్సిన ఆస్కార్‌లను లాగేసుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని పాటకు ఆస్కార్ ప్రకటించినప్పుడు నేను ప్రేక్షకుల్లో కూర్చొని ఉన్నాను. ఆ సమయంలో ఎంతో భావోద్వేగానికి (Happy with RRR)గురయ్యాను. నిజానికి ఆ సినిమాతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఆ సినిమాలో భాగం కూడా కాదు. కేవలం ఒక భారతీయురాలిగా ఇది మన సినిమా అని ఆ క్షణంలో వ్యక్తిగతంగా ఎంతో ఆనందం కలిగింది. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. ‘ది బ్రూటలిస్ట్’ చిత్రానికి గాను ఈ ఏడాది అడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలిచినందుకు నేను సంతోషించాను’’ అని అన్నారు. 2023 ఆస్కార్ వేడుకలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని నాటునాటుని పాటనుఉ దీపిక ప్రేక్షకులకు పరిచయం చేశారు. ‘డు యూ నో నాటు?’ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం నుంచి ‘నాటు నాటు’ ఇదే..’ అంటూ దీపిక ఈ పాటను పరిచయం చేయడం విశేషం. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న ఆమె సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఈ సమయం అంతా తన బిడ్డ సంరక్షణ పనిలో ఉన్నారు. ఇప్పుడామె మళ్లీ సినిమాలతో బిజీ కానుంది. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనుంది.