Chiranjeevi Reaction: సైఫ్‌కు గాయాలు.. చిరు రియాక్షన్‌..

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:35 AM

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడిపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఆ విషయం తెలిసి షాకయ్యామని అన్నారు. ‘‘


బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై (Saif Ali khan) జరిగిన దాడిపై మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. ఆ విషయం తెలిసి షాకయ్యామని అన్నారు. ‘‘సైఫ్‌ అలీఖాన్‌పై దాడి నన్ను ఎంతగానో కలచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’’ అని చిరంజీవి పోస్ట్‌ పెట్టారు. ఇదే ఘటనపై ఎన్టీఆర్‌ కూడా స్పందించారు. ‘‘సైఫ్‌ సర్‌పై దాడి  గురించి తెలిసి షాకయ్యా. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలి’’ అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.  

 
గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు దాడి ఘటన చోటుచేసుకుంది. సైఫ్‌, అతడి కుటుంబం నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అది గమనించిన సైఫ్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. కత్తితో దాడి చేసి పారిపోయాడని తెలుస్తోంది. ఈ ఘర్షణలో సైఫ్‌కి ఆరుచోట్ల గాయాలయ్యాయి. రెండు చోట్ల లోతుగా గాయమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సైఫ్‌కు శస్త్ర చికిత్స జరుగుతోంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై సైఫ్‌ భార్య కరీనా పూర్‌ ఖాన్ టీమ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘గత రాత్రి సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌ నివాసంలో చోరీకి యత్నం జరిగింది. సైఫ్‌ చేతికి గాయం కావడంతో ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో మీడియా, అబిమానులు సంయమనంతో వ్యవహరించాలని కోరుకుంటున్నాం. ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దు. దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు’’ అని పేర్కొంది.  

Updated Date - Jan 16 , 2025 | 12:28 PM