Tabu: మగాడు దానికి ఉంటే చాలు.. పెళ్లెందుకు

ABN , Publish Date - Jan 17 , 2025 | 06:37 PM

Tabu: ఆమె ప్రతిభా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా పక్కన పెడితే.. ఆమె పర్సనల్ లైఫ్‌లో చాలా ఇండిపెండెంట్‌గా జీవిస్తుంటారు. ఆమె పెళ్లి చేసుకొని విషయం తెలిసిందే.

Tabu About Marrige

బాలీవుడ్ యాక్ట్రెస్, హైదరాబాద్ బ్యూటీ 'టబు' ప్రస్తుతం అద్భుతమైన కథలతో దూసుకుపోతుంది. తెలుగులో పెద్ద సినిమాలు చేసిన అవి ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకు రాలేదు. ఆమె ఎప్పుడైతే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిందో అప్పుడు ఆమె అసలైన కెరీర్ స్టార్ట్ అయ్యింది. విభిన్నమైన కథలు, అసాధారణమైన యాక్టింగ్ తో ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


53 ఏళ్ల టబు ఇప్పటికే తన అందంతో అందరిని మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. ఇప్పటికి ఆమె బాలీవుడ్ లో అనేక రోల్స్ కి టాప్ ఛాయిస్ గా నెట్టుకొస్తున్నారంటే.. ఆమె ప్రతిభా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా పక్కన పెడితే.. ఆమె పర్సనల్ లైఫ్ లో చాలా ఇండిపెండెంట్ గా జీవిస్తుంటారు. ఆమె పెళ్లి చేసుకొని విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ..' పెళ్లి అవసరం ఏముంది? మగాడి తోడు లేకుండా బాగానే ఉన్న. మాగాడి అవసరం పడక గదిలో పనికొస్తుంది కానీ.. జీవించడానికి కాదు' అంటూ ఆమె బోల్డ్ కామెంట్స్ చేశారు. దీంతో పలువురు ఆమె ఇండిపెండెంట్ స్టాండ్ కి ఇంప్రెస్ అవుతున్నారు. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.

tabu12.jpg


ఇదివరకు కూడా టబు 'బాలీవుడ్‌లో ఉన్న పారితోషికం వ్యత్యాసాలపై స్పందించింది ‘‘ఈ ప్రశ్న తరచూ నటీమణులనే ఎందుకు అడుగుతుంటారు? నిర్మాతలను కూడా అడగొచ్చు కదా! అలాగే, మీకెందుకు ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్‌ ఇస్తున్నారని హీరోలను అడగవచ్చు కదా? అలా చేస్తే ఈ విషయంలో ఎన్నో మార్పులు వస్తాయి’’అంటూ తరుచుగా ట్యాబు ని ప్రశ్నిస్తున్నారు టబు.

Updated Date - Jan 17 , 2025 | 06:37 PM