Saif Ali Khan: ప్రమాదంలో సైఫ్ వేల కోట్ల ఆస్తులు..
ABN , Publish Date - Jan 22 , 2025 | 02:12 PM
Saif Ali Khan: "చూస్తూ చూస్తూ 15 వేల కోట్ల వంశ సంపదని ఎవరు ఇంత ఈజీగా వదులుకుంటారా అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి సైఫ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. "
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు భారీ ఎదురు దెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. ఆయన వారసత్వంగా రావాల్సిన రూ. 15వేల కోట్ల ఆస్తులను ప్రభుత్వం చేసుకోనుంది. సైఫ్ పటౌడీ రాజ్య వంశానికి చెందిన విషయం తెలిసిందే. అయితే దేశ విభజన సమయంలో సైఫ్ ముత్తమ్మమ్మ అబీదా సుల్తాన్ భారత్ విడిచి పాకిస్థాన్ వెళ్లిపోయారు. అయితే ఎనిమి చట్టం ప్రకారం ఎవరైతే దేశం వదిలి వెళ్లిపోయారో.. వారి ఆస్థి స్థానిక ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది.
దీంతో అభిదా సుల్తాన్ వదిలి వెళ్లిన రూ. 15 వేల కోట్ల ఆస్తి మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం కానుంది. గతంలో సైఫ్ ఈ ఆస్థి తమకే చెందుతుందని కోర్టులో పిటిషిషన్ దాఖలు చేశారు. అయితే, న్యాయస్థానం అప్పట్లో స్టే ఇచ్చినప్పటికీ దీన్ని గతేడాది డిసెంబర్ లో భోపాల్ హైకోర్టు ఈ స్టే ఎత్తేసింది. అయితే ఈ స్టే ఎత్తేసిన 30 రోజుల్లో మరో అప్పిల్ చేసుకోవచ్చు. కానీ.. సైఫ్ కుటుంబం నుండి ఎవరు అప్పీలు చేసుకోకపోవడం గమనార్హం. చూస్తూ చూస్తూ 15 వేల కోట్ల వంశ సంపదని ఎవరు ఇంత ఈజీగా వదులుకుంటారా అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి సైఫ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో ఏమైనా పోరాటం చేస్తారా అనేది చూడాల్సి ఉంది.
మరోవైపు ఇటీవల సైఫ్ అలీ ఖాన్ పై ఓ దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సైఫ్ అలీఖాన్ ట్రీట్‌మెంట్ నిమిత్తం అక్షరాలా రూ. 35,98,700 బిల్ అయినట్లుగా సోషల్ మీడియాలో లీలావతి హాస్పిటల్ ఇచ్చినట్లుగా ఓ బిల్ వైరల్ అవుతోంది. అంటే 5 రోజులకు దాదాపు రూ. 36 లక్షల బిల్ అయిందన్నమాట. రోజుకు దాదాపు రూ. 7 లక్షల రూపాయలు. నిజంగా ఇలాంటి ఘటన ఓ సామాన్యుడికి జరిగి ఉంటే.. అతని పరిస్థితి ఏంటి? అనేలా నెటిజన్లు డిస్కస్ చేస్తున్నారు. అయితే సైఫ్ అలీఖాన్‌కి అయిన బిల్లులో రూ. 25 లక్షల వరకు హెల్త్ ఇన్సూనెన్స్ అప్లయ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇది నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలనే విషయాన్ని తెలియజేస్తున్నట్లుగా ఉంది. మరి ఈ బిల్లు ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతోంది. ఏదయితేనేం, ఎంతయితేనేం.. సైఫ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.. అది చాలు అని అంటున్నారు ఆయన అభిమానులు.