Allu Arjun: సైఫ్ కేసులో అల్లు అర్జున్ ప్రస్తావన..

ABN , Publish Date - Feb 06 , 2025 | 11:31 AM

ప్రస్తుతం అల్లు అర్జున్‌కు టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోను తీవ్రమైన విమర్శలను పేస్ చేస్తున్నాడు. బన్నీకి అసలు ఏం సంబంధం లేని సైఫ్ అలీ ఖాన్ కేసు ప్రస్తావనలో పేరు తీసుకొచ్చారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు..

సంధ్య థియేటర్ ఘటనతో సతమతవుతున్న బన్నీ ఇప్పటికి సోషల్ మీడియాలో క్రిటిసిజం పేస్ చేస్తున్నాడు. దీనికి తోడు చాలా మంది తమకు నచ్చినట్లు కథనాలు అల్లుకుంటూ అనేక ప్రచారాలను సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైఫ్ అలీ ఖాన్ కేసుకు అల్లు అర్జున్‌ని లింక్ చేస్తున్నారు. దీంతో బన్నీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..


బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడిలో నిందితుడిని గుర్తించే క్రమంలో పోలీసులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న.. అతడే నిందితుడు అనే తేల్చేందుకు సరైన సాక్ష్యాలు లేవు. ఈ నేపథ్యంలోనే పలువురు కోట్లల్లో సంపాదన, లగ్జరీ అపార్ట్ మెంట్స్ లో నివసిస్తున్న ఎందుకు సక్రమమైన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే దీనికి.. అల్లు అర్జున్ కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉంది!


తాజాగా బాలీవుడ్ దర్శకనిర్మాత ఆకాశ్ దీప్ సబీర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ కి ఇప్పుడు వచ్చే కోట్లు సరిపోవడం లేదు. అందుకే సెక్యూరిటీని పెట్టుకోలేకపోతున్నారు వాళ్లకి అల్లు అర్జున్ కు ఇచ్చినట్టు 100 కోట్ల పైన రెమ్యూనరేషన్ ఇస్తే అప్పుడు సెక్యూరిటీని పెట్టుకుంటారేమో" అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కామెంట్స్‌పై బన్నీ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 06 , 2025 | 11:35 AM