Maha Kumbh Mela: సన్యాసినిగా మారిన మోహన్ బాబు హీరోయిన్

ABN , Publish Date - Jan 27 , 2025 | 06:34 PM

Maha Kumbh Mela: " ‘లక్స్‌ న్యూ ఫేస్‌ ఆఫ్‌ ది ఇయర్‌’తో పాటు తొలి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ అందుకుంది. అనంతరం తెలుగులోనూ ‘ప్రేమశిఖరం’, ‘దొంగా పోలీస్‌’ వంటి చిత్రాలలో నటించిన ఆమె తర్వాత బాలీవుడ్‌కే పరిమితమైంది."

Mamta Kulkarni

ప్రస్తుతం జరుగుతున్న 'మహా కుంభమేళ'లో చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుంది. సాధారణ మనుషులు సెలబ్రిటీలు అవుతుంటే.. సెలబ్రిటీలు సాధారణ మనుషులు అవుతున్నారు. తాజాగా ఓ సెన్సేషనల్ బాలీవుడ్ బ్యూటీ సన్యాసినిగా మారింది. ఆమె తెలుగులోను స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. కొన్ని ఏళ్ల తర్వాత డ్రగ్స్ ఆరోపణలు ఎదురుకుంది. ప్రస్తుతం సన్యాసినిగా మారింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే..


మమతా కుల్‌కర్ణి.. మహారాష్ట్రలో ఓ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. తండ్రి ముంబయి మాజీ కమిషనర్‌. మోడ్రన్ స్కూల్ లో చదువు. చిన్నప్పటి నుండే కల్చరల్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉండేది. ఆ ప్రభావంతోనే పెద్దయ్యాక మోడల్ అయ్యింది. మోడలింగ్ ప్రారంభించిన కొన్ని రోజులకే సినిమాల్లో అవకాశాలు లభించాయి. 1992లో ‘తిరంగ’ అనే సినిమాతో డెబ్యూ చేసింది. నెక్స్ట్ ఇయర్ ఆమె నటించిన ‘ఆషికి ఆవారా’ సినిమా నిరాశపరిచిన అవార్డులు మాత్రం ఆమెను వరించాయి. ‘లక్స్‌ న్యూ ఫేస్‌ ఆఫ్‌ ది ఇయర్‌’తో పాటు తొలి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ అందుకుంది. అనంతరం తెలుగులోనూ ‘ప్రేమశిఖరం’, ‘దొంగా పోలీస్‌’ వంటి చిత్రాలలో నటించిన ఆమె తర్వాత బాలీవుడ్ కే పరిమితమైంది. ‘వక్త్‌ హమారా హై’, ‘క్రాంతి వీర్‌’, ‘కరణ్‌ అర్జున్‌’, ‘సబ్సే బడే ఖిలాడీ’, ‘బాజీ’ వంటి చిత్రాలతో సూపర్ స్టార్‌డం చూసింది.

mamtakulakarni.jpg


పతనం

సూపర్ స్టార్‌డంతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఆమె కెరీర్ ను ‘చైనా గేట్‌’ అనే చిత్రం మలుపుతిప్పింది. దర్శకుడు రాజ్‌కుమార్‌ సంతోషి మొదట ఈ సినిమా కోసం మమతని సెలెక్ట్ చేసిన.. అనంతరం విబేధాలు రావడంతో సినిమా నుంచి తొలిగించారు. తర్వాత హీరోయిన్ గా ఆ ఛాన్స్ ని ఊర్మిళ కొట్టేసింది. 90స్ యూత్ ని షేక్ చేసిన ‘చమ్మా.. చమ్మా’ సాంగ్ ఈ చిత్రంలోనిదే. తర్వాత ఆమెకు ఏ సినీ దర్శక, నిర్మాతలు అవకాశాలు ఇవ్వకపోవడంతో విదేశాలకు షిఫ్ట్ అయిపోయింది. అక్కడే డ్రగ్స్ కు బానిస అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఆమె ఇండియాలో అడుగు పెట్టారు. అయితే అందరు ఆమె తిరిగి సినిమాల్లో నటిస్తుందేమో అని భావించారు. కానీ ఆమె ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.


మహా కుంభమేళ సందర్భంగా భారత్‌కు వచ్చిన ఆమె కిన్నెర అఖాడాలో చేరింది. అనంతరం తన పేరును యమాయ్‌ మమతా నందగిరిగా మార్చుకుంది. కిన్నెర అఖాడా ఆచార్య మహామండలేశ్వర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ త్రిపాఠి ఆధ్వర్యంలో సన్యాస దీక్ష స్వీకరించారు. ఆమె ఉద్వేగంతో మాట్లాడుతూ ‘‘మళ్లీ సినిమాలు చేయడాన్ని నేను అస్సలు ఊహించలేను. ఇప్పుడది అసాధ్యం. జీవితంలో ప్రతిదీ అవసరమే. అందులో వినోదం కూడా భాగమే. మీరెప్పుడూ మీ అవసరాలను గుర్తించాలి. కానీ, ఆధ్యాత్మిక భావన అనేది పూర్తిగా అదృష్టం ఉంటేనే కలుగుతుంది. సిద్ధార్థుడు జీవితంలో అన్నీ చూసిన తర్వాతే మారాలని నిశ్చయించుకున్నాడు. గౌతమ బుద్ధుడిగా మారిపోయాడు. ఇది మహాదేవ్‌.. మహాకాళి ఆజ్ఞ, నా గురువుల ఆదేశమంటూ చెప్పుకొచ్చారు.

Also Read- Allu Arjun: విధ్వంసం ఖాయమే.. ట్రెండింగ్ మార్కెట్‌ని పట్టుకున్నారు

Also Read-Meerpet Murder: సూక్ష్మదర్శిని సిరీస్ స్ఫూర్తితోనే శవాన్ని మాయం చేశాడు..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 27 , 2025 | 06:36 PM