Bipasha Basu: మికా సింగ్‌కు బిపాసా కౌంటర్‌.. వార్‌ తగ్గలేదు..

ABN , Publish Date - Mar 03 , 2025 | 06:21 PM

బాలీవుడ్‌ నటి బిపాసా బసు(Bipasha Basu post viral), ఆమె భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌పై (Karan Singh grover) సింగర్‌ మికా సింగ్‌ (SInger Mika singh) ఇప్పటికే ఎన్నోసార్లు కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే!

బాలీవుడ్‌ నటి బిపాసా బసు(Bipasha Basu post viral), ఆమె భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌పై (Karan Singh grover) సింగర్‌ మికా సింగ్‌ (SInger Mika singh) ఇప్పటికే ఎన్నోసార్లు కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే! ఈ దంపతుల వల్ల తాను ఆర్థికంగా ఎంతో నష్టపోయానని పలు ఇంటర్వ్యూల్లో ఆవేదన వ్యక్తం చేసిన ఆయన మరోసారి బిపాసాపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బిపాసా బసు (Bipasha Basu) ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. విషపూరితమైన వ్యక్తులకు దూరంగా ఉండాలని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు.  ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.  ‘‘విషపూరితమైన స్వభావం కలిగిన వ్యక్తులు అల్లర్లు సృష్టిస్తారు. తప్పు ఏదైనా సరే నిందలు మాత్రం ఎదుటి వ్యక్తుల మీదే వేస్తారు. వారు చేసిన తప్పులకు బాధ్యత మాత్రం వహించరు. అలాంటి వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరిపైనా ఉండాలి’’ అని రాసి ఉన్న ఒక సందేశాత్మక పోస్ట్‌ను బిపాసా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. సింగర్‌ మికా సింగ్‌ కోసమే ఆమె ఈ కౌంటర్‌ ఇచ్చారని నెటిజన్లు భావిస్తున్నారు.



Bipasaaa.jpg
వీరి మధ్య గొడవేంటంటే..
బిపాసా బసు, ఆమె భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ నటించిన ‘డేంజరస్‌’ వెబ్‌ సిరీస్‌కు మికా సింగ్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సిరీస్‌ షూట్‌ కోసం లండన్‌కు వెళ్లినప్పుడు బిపాసా దంపతులు నాటకాలు ఆడారని, షూట్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించేవారు కాదని ఆయన ఆరోపించారు. వారి వల్లనే రూ.4 కోట్ల బడ్జెట్‌ కాస్త రూ.14 కోట్లు అయిందన్నారు. వారి ప్రవర్తన చూశాక నిర్మాతగా మారినందుకు ఎంతో బాధపడ్డానని మికా సింగ్‌ చెప్పారు. వాళ్లు నాకు చేసిన అన్యాయం వల్లే ఈ రోజున వారికి ఏ పనీ లేకుండా పోయింది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Bipasa.jpg

Updated Date - Mar 03 , 2025 | 06:28 PM