Saira Banu: కష్ట కాలం.. అండగా రెహమాన్‌.. సైరా పోస్ట్‌

ABN , Publish Date - Feb 21 , 2025 | 02:01 PM

తాజాగా మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా సైరాకు సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సైరా ఒక లేఖ విడుదల చేశారు. క్లిష్ట సమయంలో తనకు సపోర్ట్‌గా నిలిచిన రెహమాన్‌తోపాటు ఆత్మీయులకు సైరా ధన్యవాదాలు చెప్పారు.

సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌9AR Rahman), ఆయన సతీమణి సైరా బాను (Saira Banu) 30 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. విడిపోయినా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని ఇద్దరూ ఓ సందర్భంలో చెప్పారు. తాజాగా మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా సైరాకు సర్జరీ (Saira Banu hospitalised) జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సైరా ఒక లేఖ విడుదల చేశారు. క్లిష్ట సమయంలో తనకు సపోర్ట్‌గా నిలిచిన రెహమాన్‌తోపాటు ఆత్మీయులకు సైరా ధన్యవాదాలు చెప్పారు.  



"ఎమర్జెన్సీ కారణంగా కొన్నిరోజుల క్రితం సైరా ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఒక సర్జరీ జరిగింది. క్లిష్ట సమయంలో కోలుకోవడం పైనే ఆమె పూర్తి దృష్టిపెట్టారు. తనకు ఎంతో సపోర్ట్‌గా నిలిచిన వారందరికీ ముఖ్యంగా రెహమాన్‌, లాస్‌ ఏంజెల్స్‌లోని రసూల్‌, ఆయన సతీమణి దియాతోపాటు ేస్నహితులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. వాళ్లు ఇచ్చిన ప్రోత్సాహంపై  ఆమె ఎంతో సంతోషంగా ఉన్నారు’’ అని ఉన్న లేఖను ఆమె తరఫు న్యాయవాది వందన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.


29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు నవంబర్‌ 19న రెహమాన్‌ ఒక పోస్ట్‌ పెట్టారు. పరస్పర అంగీకారంతో తాము విడిపోతున్నామని చెప్పారు. ఇదే విషయంపై సైరా కూడా స్పందించారు. ‘‘మేము ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. కాబట్టి మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దు’’ అని కోరారు.  

Updated Date - Feb 21 , 2025 | 02:04 PM